close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బంద్‌

తమ డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు ఆర్టీసీ ఐకాసతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. బంద్‌ ప్రభావం కనిపించరాదు: కేసీఆర్‌

రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆర్టీసీ బస్సులను యథాతథంగా నడపాలని, బంద్‌ ప్రభావం కనిపించరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సేవలందించాలని, బస్సులకు ఆటంకాలు కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. శనివారం ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన బంద్‌, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి ప్రగతిభవన్‌లో  కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట

ఆంధ్రప్రదేశ్‌లోని అగ్రిగోల్డ్‌ బాధితులకు తీపి కబురు అందింది. రూ.10 వేలు, అంతకంటే తక్కువ మొత్తంలో డిపాజిట్‌ చేసి, సంస్థ చేతిలో మోసపోయిన వారికి సొమ్ము తిరిగి చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.263.99 కోట్లు మంజూరు చేసింది. త్వరలో వీటిని చెల్లిస్తామంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. బాబు వ్యాఖ్యలు అర్థరహితం

పత్రికాస్వేచ్ఛపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు అర్థ్ధరహితమని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వం అమలు చేసే పథకాల గురించి ఉన్నది లేనట్లు రాసే పత్రికలపై ఎవరైనా పరువునష్టం దావా వేస్తారు. గతంలో సమాచార, పౌరసంబంధాల శాఖ చూసేది. ఇప్పుడు ఆయా శాఖల కార్యదర్శులకే అధికారం ఇవ్వాలని క్యాబినెట్‌లో నిర్ణయించాం’’అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. సుప్రీంకోర్టు తదుపరి సీజేగా బోబ్డే!

సీనియారిటీ ప్రాతిపదికన భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే పేరును ప్రస్తుత చీఫ్‌జస్టిస్‌ రంజన్‌ గొగొయి శుక్రవారం కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర న్యాయమంత్రిత్వశాఖకు లేఖ రాసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2018 అక్టోబరు 3న భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ రంజన్‌గొగొయి ఈ ఏడాది నవంబరు 17న పదవీ విరమణ పొందనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కాంగ్రెస్‌ ప్రకటనలతో పాకిస్థాన్‌కే మేలు

జమ్మూ-కశ్మీర్‌లో 370వ అధికరణం రద్దు విషయంలో కాంగ్రెస్‌పార్టీ ప్రకటనలు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు ఉపయోగపడేవిగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా విమర్శించారు. పొరుగు దేశంతో కాంగ్రెస్‌కు ఉన్న బంధం ఏమిటని ప్రశ్నించారు. శుక్రవారం హరియాణాలోని గొహనా, హిస్సార్‌ల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. దేశానికి నష్టం కలిగేలా మాట్లాడకండని కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి మోదీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కల్కి ఆశ్రమంలో రూ.93కోట్లు విలువైన  నగదు, ఆభరణాలు స్వాధీనం

కల్కి ఆశ్రమం, దాని అనుబంధ సంస్థల్లో ఈ నెల 16న జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాల విలువ రూ.93 కోట్ల మేర ఉంటుందని ఆదాయ పన్నుశాఖ వెల్లడించింది. ఇందులో రూ.43.9 కోట్ల నగదుతో పాటు రూ.18 కోట్ల విలువైన అమెరికన్‌ డాలర్లు, రూ.26 కోట్ల విలువ చేసే 88 కిలోల బంగారం, రూ.5 కోట్ల విలువైన 1,271 క్యారెట్ల వజ్రాలున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘అయోధ్య’పై రాజీ పడం

అయోధ్య భూ వివాదంపై మధ్యవర్తిత్వ బృందం చూపిన రాజీ మార్గాన్ని తాము అంగీకరించేది లేదని సున్నీ వక్ఫ్‌ బోర్డు మినహా ఇతర ముస్లిం పక్షాలు స్పష్టం చేశాయి. ఈ కేసు నుంచి ఉపసంహరించుకుంటున్నట్టుగా సున్నీ వక్ఫ్‌ బోర్డు చెప్పినట్టు వచ్చిన వార్తలపైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. కాగా మధ్యవర్తుల వద్దకు హిందూ పక్షాలు ఏవీ వెళ్లలేదని, అందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొనలేదని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అఫ్గానిస్థాన్‌లో ఉగ్ర మారణహోమం

ఉగ్ర దాడులతో అల్లాడిపోతున్న అఫ్గానిస్థాన్‌లో మరో భారీ మారణహోమం చోటుచేసుకుంది. నంగర్‌హార్‌ ప్రావిన్స్‌లోని హస్కామినా జిల్లాలో శుక్రవారం ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా బాంబులు పేలాయి. ఈ ధాటికి మసీదు ధ్వంసమైంది. పైకప్పు కుప్పకూలింది. ప్రార్థనల నిమిత్తం అక్కడకు చేరినవారిలో 62 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 36 మంది గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. భారత్‌కు ఎదురుందా?

దూకుడు కొనసాగిస్తూ టెస్టు సిరీస్‌ను 3-0తో ముగించాలన్న పట్టుదలతో భారత్‌.. కనీసం ఒక్కటైనా నెగ్గి ఊరట పొందాలన్న తపనతో దక్షిణాఫ్రికా.. ఆఖరి పోరుకు సన్నద్ధమయ్యాయి. మరికాసేపట్లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. విశాఖపట్నం, పుణె టెస్టుల్లో దక్షిణాఫ్రికాను భారత్‌ చిత్తు చేసింది. చివరి మ్యాచ్‌లో విజయంతో మరో 40 పాయింట్లను ఖాతాలో వేసుకుని.. ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో తన అగ్రస్థానాన్ని భారత్‌ మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.