close

తాజా వార్తలు

ఆర్టీసీ బంద్‌.. తెగిన నేత బొటన వేలు

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బంద్‌ కొనసాగుతోంది. పలుచోట్ల నేతల అరెస్టులు, ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రబంద్‌కు మద్దతుగా హైదరాబాద్‌ బస్‌భవన్‌ వద్ద వామపక్షాల నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. వామపక్ష నేతలు బస్‌భవన్‌ ముట్టడికి యత్నించగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆందోళన కారులను లాక్కెళుతుండగా.. న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావుకు గాయమైంది. ఆయన బొటనవేలు గోరు వరకు తెగిపోయింది. ఆయనను అరెస్టు చేసి వాహనంలోకి ఎక్కించి డోర్ వేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అనంతరం చికిత్స నిమిత్తం ఆయన్ను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.