close

తాజా వార్తలు

ఆవిషయంలో దీపిక నాకు ఆదర్శం: రణవీర్‌

ముంబయి: అటు సినిమా, ఇటు ఫ్యాషన్‌ షోలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు బాలీవుడ్‌ నటుడు రణవీర్‌ సింగ్‌. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నాసరే తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం చాలా సరదాగా గడుపుతుంటారు ఈ నటుడు. తాజాగా ఆయన వోగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేయగలుగుతున్నారు అని విలేకరి రణవీర్‌ను అడగగా.. ‘వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను నేను సమానంగా చూస్తాను. ఈ రెండింటి మధ్య సమయాన్ని సద్వినియోగం చేసుకోనే విషయంలో నా అందమైన భార్య దీపికా పదుకొణె నాకు ఆదర్శం. ఎందుకంటే సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడంలో తను మాస్టర్‌.’ అని రణవీర్‌ తెలిపారు.

ప్రస్తుతం రణవీర్‌-దీపిక జంటగా ‘83’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. భారత క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాలో కపిల్‌ దేవ్‌ పాత్రలో రణవీర్‌ నటించారు. కపిల్‌ భార్య రోమీ భాటియా పాత్రను దీపికా పదుకొణె పోషించారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.