
తాజా వార్తలు
1. రేపు దిల్లీ పర్యటనకు సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు దిల్లీ వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశముంది. రేపు ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు ఆయన దిల్లీ పర్యటనకు వెళ్తారు.
2. మూడు స్థావరాలు పూర్తిగా ధ్వంసం: రావత్
పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడుల్లో 6 నుంచి 10 మంది పాక్ సైనికులు మృతి ఉంటారని భారత సైనికాధిపతి బిపిన్ రావత్ తెలిపారు. ఉగ్రవాదులు కూడా దాదాపు అదే స్థాయిలో హతమై ఉంటారని చెప్పారు. ఈ మేరకు రావత్ ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. నీలం వ్యాలీలో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు చెందిన నాలుగు స్థావరాలు లక్ష్యంగా భారత్ దాడులు చేసిందన్నారు. అందులో మూడు స్థావరాలు పూర్తిగా ధ్వంసం కాగా, మరొకటి స్వల్పంగా ధ్వంసమైందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఏపీలో జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు వీరే..
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులైన జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రుల వివరాలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఉత్తమ్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన తెరాస
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై తెరాస నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బయటకు పంపించాలని తెరాస కోరింది. కోదాడకు చెందిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ హుజూర్‌నగర్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. భారత హై కమిషనర్‌కు పాక్ సమన్లు
పాకిస్థాన్ మరోసారి తన దుర్భుద్ధిని ప్రదర్శించింది. పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేయడంతో ఆ దేశ విదేశాంగ శాఖ భారత హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియాకు సమన్లు జారీ చేసింది. ఈ దాడులను కాల్పుల విరమణ ఉల్లంఘనగా పాక్ ఆరోపించింది. పాక్ సైన్యం ఉగ్రవాదులను కశ్మీర్లోకి ఎగదోసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే క్రమంలో ఆయా ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం శతఘ్నులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. జగన్ గారూ..ఏమిటీ డ్రామాలు?:దేవినేని
గత నాలుగున్నర నెలల్లో పెండింగ్ బిల్లులు ఎవరెవరికి ఇచ్చారో చెప్పే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా అని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనులు ఒకే గుత్తేదారుకు దక్కాయని.. వెలిగొండ పనుల టెండరింగ్‌లో రియాలిటీ షో జరుగుతోందని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ ఇంట్లో కూర్చునే డ్రామాలు నడుపుతున్నారని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మెట్రో రైలులో రద్దీ పెరిగింది: ఎన్వీఎస్ రెడ్డి
ఆర్టీసీ సమ్మె కారణంగా మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందని మెట్రో రైలు ఎండీ ఎన్వీస్ రెడ్డి తెలిపారు. సాధారణ రోజుల్లో 3 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండగా.. సమ్మె కారణంగా మరో 50 వేల మంది అదనంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం మియాపూర్ మెట్రో స్టేషన్లో రద్దీని ఆయన పరిశీలించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరిగిందని, అందుకే ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పార్టీ మారే ఆలోచనలేదు: అవినాష్
తెదేపాలో తన ఎదుగుదల ఓర్వలేని కొందరు పనిగట్టుకుని తాను పార్టీని వీడనున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈవదంతులు నమ్మవద్దని పార్టీ కార్యకర్తలు, అభిమానులను కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతానని, దేవినేని నెహ్రూ ఆశయాల సాధనకు పాటుపడతానని అవినాష్ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ధోనీలా మ్యాచ్‌ను ముగిస్తా: దినేశ్ కార్తీక్
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో స్థానం దక్కించుకుంటానని మీడియాతో టీమ్ఇండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు. పరిస్థితులను అర్థం చేసుకొని ఫినిషర్‌గా మ్యాచ్‌ను ముగిస్తానని తెలిపాడు. ‘టీ20 ప్రపంచకప్‌కు ఏడాది సమయం ఉంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించి టీమ్ఇండియాలో చోటు సంపాదిస్తా’ అని కార్తిక్ చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రెండంతస్తుల భవనం నుంచి కిందపడ్డ చిన్నారి
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వదిలేశారు..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
