
తాజా వార్తలు
1. ‘మహా’ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్!
మహారాష్ట్ర, హరియాణాల్లో పోలింగ్ ముగిసింది. దీంతో పలు జాతీయ మీడియా సంస్థలు తమ సర్వేలను విడుదల చేశాయి. ఆయా సర్వేలన్నింటిలోనూ రెండు రాష్ట్రాల్లో మళ్లీ కమల దళమే వికసిస్తుందని తేల్చాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉండగా అధికారంలోకి రావాలంటే 145 సీట్లు రావాల్సి ఉంది. హరియాణాలోనూ కమలమే వికసిస్తుందని సర్వేలు పేర్కొంటున్నాయి. ఇక్కడ మొత్తం 90 స్థానాలు ఉండగా అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. హుజూర్‌నగర్‌లో ముగిసిన పోలింగ్
హుజూర్నగర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల పరిధిలో పోలింగ్ జరిగింది. హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల్లోని ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. క్లీన్‌స్వీప్‌కు 2 వికెట్ల దూరంలో కోహ్లీసేన
సఫారీలపై ఇన్నింగ్స్ తేడాతో విజయానికి కసరత్తు దాదాపు పూర్తైంది. మరో 2 వికెట్లు దక్కితే సిరీస్ క్లీన్‌స్వీప్. రోహిత్ ద్విశతకం, రహానె శతకంతో భారత్ భారీ స్కోరు చేస్తే.. ఉమేశ్, షమి, అశ్విన్, జడ్డూ, నదీమ్ బంతితో విజృంభించడంతో దక్షిణాఫ్రికా ఒకే రోజు 16 వికెట్లు చేజార్చుకుంది. అంపైర్లు రెండు ఓవర్లు పొడగించినప్పటికీ కోహ్లీసేన ట్రోఫీ అందుకోవడం చూడాలంటే మరొక్క రోజు ఆగాల్సిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సమ్మెతో దసరా సీజన్లో రూ.125కోట్ల నష్టం
ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు ఇవ్వాలనే పిటిషన్‌పై విచారణ ఈనెల 29కి వాయిదా పడిన నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్‌శర్మ ఈ కౌంటర్‌ను దాఖలు చేశారు. ఆర్టీసీకి రూ.4,882కోట్ల వార్షికాదాయం ఉండగా.. ఖర్చు రూ.5,811కోట్లు అవుతోందని వివరించారు. సమ్మెతో దసరా సీజన్లోనే రూ.125కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రూ.10వేలకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం!
తిరుమల శ్రీనివాసుడిని కులశేఖరపడి కావలి వరకు వీవీఐపీలు దర్శించుకునే తీరులోనే సామాన్యభక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా తితిదే కీలక నిర్ణయం తీసుకుంది.అయితే ఈ దర్శనానికి మనం రూ.10000లను విరాళంగా ఇవ్వాల్సివుంటుంది. శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ( శ్రీవాణి ట్రస్ట్) పేరుతో ఈ పథకాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్టు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శ్రీవాణి పథకానికి రూ.10వేలు విరాళంగా ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ అందిస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఇక సియాచిన్ పర్యటనకు వెళ్లొచ్చు..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్‌ను పర్యాటకుల సందర్శన కోసం తెరిచినట్లు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇందుకోసం లద్ధాఖ్‌లో శ్యోక్ నది గుండా వెళ్లే వ్యూహాత్మక వంతెనను ఆయన భారత సైనికాధిపతి బిపిన్ రావత్‌తో కలసి సోమవారం ప్రారంభించారు. ఈ వంతెన శ్యోక్ నది నుంచి వెళ్తూ చైనా సరిహద్దు నియంత్రణ రేఖకు అనుసంధానంగా ఉండే బెగ్ ఓల్డీ సెక్టార్‌ను కలుపుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. పాకిస్థాన్ పాకిస్థానే: రవిశంకర్ ప్రసాద్
భారత్‌కు ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా పాకిస్థాన్ పోస్టల్ మెయిల్ సర్వీసులు నిలిపివేయడాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ చర్య అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘించడమేనన్నారు. పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ పోస్టల్ యూనియన్ ప్రమాణాలకు విరుద్ధంగా ఉందన్నారు. ఏదేమైనా తన బుద్ధిని చూపించుకోవడంలో మాత్రం పాకిస్థాన్ పాకిస్థానేనని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. అసలు ‘మా’ సమావేశంలో ఏం జరిగింది?
ఆదివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అత్యవసరంగా సమావేశం కావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చ నడిచింది. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకుండా సమావేశం నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇది ‘మా’ ఆత్మీయ సమావేశం అంటూ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జీవిత రాజశేఖర్ చెప్పుకొచ్చారు.సమావేశం ఎలా జరిగింది? ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నారు? అనే అంశాలపై స్పష్టతనిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. టీఎస్ ఆర్టీసీ బస్సుబోల్తా:30 మందికి గాయాలు
యాదాద్రి జిల్లా భువనగిరి చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 30 మందికి గాయాలయ్యాయి. పరకాల డిపోకు చెందిన బస్సు.. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యమే ఘటనకు కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
10. మళ్లీ లైవ్‌వైర్ ఉత్పత్తి ప్రారంభించిన హార్లీ
అమెరికాకు చెందిన మోటారుసైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీని మళ్లీ ప్రారంభించింది. ఈ కంపెనీ లైవ్‌వైర్ పేరుతో తయారు చేసే బైకుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఛార్జింగ్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఈ బైకు ఓనర్లు సమస్య తీరే వరకు కేవలం డీలర్ కార్యాలయాల్లో మాత్రమే ఛార్జింగ్ చేసుకోవాలని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
