
తాజా వార్తలు
మోదీని కలిసిన నోబెల్ విజేత
దిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. సోమవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లిన అభిజిత్ ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మోదీ తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ‘నోబెల్ సాధించిన అభిజిత్ బెనర్జీతో అద్భుతమైన భేటీ జరిగింది. మానవ సాధికారితపై ఆయనకు ఎంత తపన ఉందో తన మాటల్లో స్పష్టంగా కన్పించింది. పలు అంశాలపై మేం చర్చించుకున్నాం. ఆయన సాధించిన విజయాలకు భారత్ గర్విస్తోంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అభిజిత్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతోందని, తక్షణమే ఉద్దీపన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిజిత్ బెనర్జీ ఇటీవల అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాక.. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా విమర్శలు చేశారు. ఈ విమర్శలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తిప్పికొట్టారు. అభిజిత్ విధానాలు వామపక్ష భావజాలంతో ఉన్నాయని ఆరోపించారు. ఇది కాస్తా వివాదాస్పదమైంది. అయితే, రాహుల్‌గాంధీ వంటి ప్రతిపక్ష నేతలు మాత్రం అభిజిత్ వ్యాఖ్యలను సమర్థించారు.
ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలకు గానూ అభిజిత్ ఈ ఏడాది అర్థశాస్త్రంలో నోబెల్ సాధించారు. తన భార్య ఎస్తర్ డఫ్లో, మరో ఆర్థికవేత్త మైఖెల్ క్రెమెర్‌తో కలిసి ఈ బహుమతిని పంచుకున్నారు. భారత్‌కు చెందిన అభిజిత్ అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవలే స్వదేశానికి వచ్చిన ఆయన నేడు మోదీని కలిశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
