
తాజా వార్తలు
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆర్య
కోడంబాక్కం, న్యూస్‌టుడే: ప్రపంచ స్థాయిలో టెర్మినేటర్ చిత్రాలు హవా చాటుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఐదు భాగాలు విడుదలయ్యాయి. ఆర్నాల్డ్ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఆరో భాగం విడుదలకు సిద్ధంగా ఉంది. 1991లో వచ్చిన ‘టెర్మినేటర్- 2 జడ్జిమేంట్ డే’కు దీనిని సీక్వెల్‌గా రూపొందించారు. జేమ్స్ కేమరూర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలోనూ ఈ సినిమా విడుదలవుతోంది. తమిళ ట్రైలర్ విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. నటుడు ఆర్య ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కొంత కాలంగా జిమ్‌కు వెళ్తున్నా. అందుకు ఫలితంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం దక్కిందని అనుకుంటున్నా. జిమ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఆర్నాల్డ్ గురించి తెలుసు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన నటించిన సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రైలర్‌ను చూస్తున్న ప్రతిసారీ ఏదో కొత్త విషయం అర్థమవుతోంది. ఆర్నాల్డ్ నటించిన ట్రు లైస్, బార్బేరియన్, టెర్మినేటర్ చిత్రాలన్నీ చాలా సార్లు చూశా. మరో 100 ఏళ్లు కూడా ఆయన పేరు చిత్ర పరిశ్రమలో వినిపిస్తుంటుందని’ చెప్పారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
