close

తాజా వార్తలు

దెయ్యమన్నారు.. బంగారం దోచారు!

దంపతుల అరెస్టు..

790 గ్రాముల బంగారం స్వాధీనం


స్వాధీనం చేసుకున్న నగలను చూపుతున్న డీఎస్పీ సూర్యనారాయణ, పోలీసు అధికారులు

ఇక్కడ కన్పిస్తున్న నగలను చూశారా? ఇవేవో దొంగలు.. దోపిడీ దారుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నవిలా ఉన్నాయనుకుంటాం. అసలు విషయం వేరు. కడపలో మంత్రాలకు ఈ నగలన్నీ రాలాయి. అదే! మంత్రాలతో దెయ్యాన్ని వెళ్లగొడతామంటే ఇంటి యజమానులే 790 గ్రాముల ఆభరణాలను స్వయంగా సమర్పించుకున్నారు. వాటితో మాంత్రికులు పరారయ్యారు. చివరికి పోలీసులకు చిక్కారు.

దెయ్యం పేరుతో నగలు మాయం

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప రెండో పట్టణ ఠాణా పరిధిలో మూఢనమ్మకాల పేరిట బంగారు నగలు కాజేస్తున్న దంపతులను అరెస్టు చేసి వారి నుంచి 790 గ్రాముల బంగారు నగలు స్వాధీనపరచుకున్నట్లు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. అరెస్టయిన వారిని మంగళవారం డీఎస్పీ తన కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. డీఎస్పీ వెల్లడించిన వివరాల మేరకు.. రెండో పట్టణ ఠాణాకు చెందిన షేక్‌ అస్మా ఇల్లు నిర్మిస్తుండగా కొన్ని సమస్యలు వచ్చాయి. కడప రవీంద్రనగర్‌లోని మురాదియనగర్‌కు చెందిన జమలుల్లాబాషా, అతని భార్య సయ్యద్‌ నవీద్‌సుల్తానాలను ఆశ్రయించారు. భార్యాభర్తలిద్దరూ వెళ్లి షేక్‌ అస్మా ఇంటిని చూశారు. ఈ ఇంట్లో దెయ్యం ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఆ దెయ్యాన్ని ఒక సీసాలో బంధిస్తాం, సీసాలో నుంచి దెయ్యం బయటికి రాకుండా బంగారు నగలతో పూజలు చేయాలని సీసాపై బంగారు నగలు పెట్టాలి లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందన్నారు. వారు చెప్పిన ప్రకారం బాధితురాలు 221 గ్రాముల బంగారు నగలు ఇచ్చారు. ఆ నగలు తిరిగి ఇవ్వకపోడంతో అస్మా రెండో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అప్పటికే భార్యాభర్తలు పలువురిని ఇలా మోసం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి భార్యాభర్తలు బెంగళూరుకు పారిపోతుండగా అరెస్టు చేసి వారి నుంచి మొత్తం 790 గ్రాముల బంగారు నగలను స్వాధీనపరచుకున్నారు. వీరి చేతిలో మోసపోయిన వారు తమకు తెలపాలని, ప్రస్తుత రోజుల్లో ఇంకా దెయ్యాలంటూ మూఢనమ్మకాలతో మోసపోవద్దని డీఎస్పీ అన్నారు.ఈ కేసును ఛేదించిన అర్బన్‌ సీఐ మహమ్మద్‌ అలీ, ఎస్సై మంజునాథ్‌లకు ఎస్పీ ద్వారా నగదు రివార్డు అందజేస్తామన్నారు.

 


అరెస్టయిన నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ సూర్యనారాయణ, చిత్రంలో

అర్బన్‌ సీఐ మహమ్మద్‌ అలీ, ఎస్సై మంజునాథ్‌, సిబ్బంది



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.