close

తాజా వార్తలు

కేసీఆర్‌ వెంటే ప్రజలు: సైదిరెడ్డి

సూర్యాపేట: తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కొనసాగుతోంది. ఏడో రౌండ్‌ పూర్తయ్యే సరికి తెరాస అభ్యర్థి సైదిరెడ్డి 14వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. తొలి రౌండ్‌ నుంచీ ఆయన స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. 2014 నుంచి కేసీఆర్‌కు దూరంగా ఉన్నామని భావించిన హుజూర్‌నగర్‌ ప్రజలు కేసీఆర్‌కు దగ్గర కావాలంటే ఓటేసి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా తీర్పు ఇస్తున్నారన్నారు. ప్రజలు ఇతర ఏ పార్టీనీ నమ్మడంలేదని.. తెరాస పార్టీనే విశ్వసిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, భాజపా ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలు మాత్రం తమవైపే మొగ్గు చూపారన్నారు. కాంగ్రెస్‌ నుంచి 2వేల మంది, భాజపా నుంచి 2వేల మంది ప్రచారాలు చేశారని.. ఈ రోజు భాజపాకు 2వేల ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆ రెండు పార్టీలూ కలిసి అనేక దాడులు చేయించాయనీ.. ఎన్నికలు వాయిదావేయాలని కూడా ప్రయత్నించాయని ఆరోపించారు. ప్రజలు హుజూర్‌నగర్‌ అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.