close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. మహారాష్ట్రలో కాషాయం... హరియాణాలో హంగ్‌

మహారాష్ట్రలో మరోసారి కమలం వికసించింది. సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలను పొందాలన్న కమలనాథుల ఆశలకు కొంతమేర గండిపడినా, మిత్రపక్షమైన శివసేనతో కలిసి అధికార పీఠంపై కొలువుదీరడం ఖాయంగా కనిపిస్తోంది. హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా కేవలం 6 స్థానాల దూరంలో నిలిచిపోయింది. ఏ పార్టీకీ స్పష్టమైన సంఖ్యాబలం లేకపోవడంతో కొత్తగా ఏర్పాటైన జన్‌నాయక్‌ జనతా పార్టీ అధినేత దుష్యంత్‌ చౌతాలా, స్వతంత్రులు కీలకంగా మారారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. గ్రూప్‌-2 తుది ఎంపిక జాబితా విడుదల

గ్రూప్‌-2 ఉద్యోగాల తుది ఫలితాలను టీఎస్‌పీఎస్సీ గురువారం ప్రకటించింది. మొత్తం 1032 ఉద్యోగాల్లో 1027కి తుది ఎంపిక జాబితా వెల్లడించింది. గురువారమిక్కడ టీఎస్‌పీఎస్సీ భవన్‌లో జరిగిన కమిషన్‌ ప్రత్యేక సమావేశంలో ఈ ఫలితాలను ఆమోదించింది. ఇందులో 259 డిప్యూటీ తహసీల్దార్లు, 284 మంది ఎక్సైజ్‌ ఎస్సైలు, 156 వాణిజ్య పన్నులశాఖ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌ తదితర పోస్టులు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. రాష్ట్రంలో 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేయనున్నామని, దీనికి కేంద్రం సహకరించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. పరిశ్రమల్లోని అన్ని అవకాశాలనూ స్థానిక యువత అందిపుచ్చుకునేలా శిక్షణనిస్తామని, నిరుద్యోగ సమస్యకు ఇదే సరైన పరిష్కారమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో రూ.50 కోట్లతో నిర్మించిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) నూతన ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రాజధానిపై మీ వైఖరేంటి?

ఏపీ రాజధాని నిర్మాణం, స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై ప్రభుత్వ వైఖరేమిటో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వాటిపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం సరికాదని అభిప్రాయపడింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రుల ఎజెండాలతో తమకు పని లేదని, చట్టంతో మాత్రమే తమకు సంబంధమని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. విజయానికి కృతజ్ఞతగా రేపు సభ

 హుజూర్‌నగర్‌లో భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారం అక్కడ సభ నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. దీనికి అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాస నేతలకు సూచించారు. హుజూర్‌నగర్‌లో ఉన్న పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని ఫోన్‌లో అభినందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. జగన్‌ డిమాండ్లన్నీనిర్హేతుకం: సుజనా చౌదరి

విభజన చట్టంలోని అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన వినతి పత్రంలోని డిమాండ్లన్నీ నిర్హేతుకమైనవనీ, వాటిలో నెరవేర్చదగినది ఒక్కటీ లేదని భాజపా ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. రాష్ట్రం చెబుతున్న లెక్కలన్నీ వాస్తవ విరుద్ధమని, కొన్ని అంచనాల ఆధారంగా వేసినవి మాత్రమేనని కొట్టిపారేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. టెలికాంకు సుప్రీం షాక్‌

టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలకు షాక్‌ ఇచ్చే ఆదేశాలను సుప్రీంకోర్టు గురువారం జారీచేసింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) కింద టెలికాం సంస్థల నుంచి రూ.92,000 కోట్ల రికవరీకి అనుమతించాలన్న కేంద్రప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించింది. ప్రైవేటు సంస్థలైన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లతో పాటు ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ లైసెన్స్‌ ఫీజు కింద ఇంకా రూ.92,000 కోట్లు చెల్లించాల్సి ఉందని గత జులైలో సుప్రీంకోర్టుకు కేంద్రప్రభుత్వం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కర్తార్‌పుర్‌ కారిడార్‌పై భారత్‌-పాక్‌ల చారిత్రక ఒప్పందం

భారత్‌లోని సిక్కులు ఇక పాకిస్థాన్‌లోని పవిత్ర దర్బార్‌ సాహిబ్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా దర్శించుకోవచ్చు. ఇందుకు వీలు కల్పించే కర్తార్‌పుర్‌ కారిడార్‌ను వాడుకలోకి తీసుకొచ్చేందుకు ఉభయ దేశాలు గురువారం చారిత్రక ఒప్పందం చేసుకున్నాయి. భారత పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ మందిరం నుంచి పాకిస్థాన్‌ కర్తార్‌పుర్‌లోని దర్బార్‌ సాహిబ్‌ మందిరానికి ఈ నడవా అనుసంధానంగా ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. పుట్టే బిడ్డల తెలివితేటలపై... గర్భిణుల్లోని రసాయనాల ప్రభావం

గర్భిణులూ జాగ్రత్త! ప్లాస్టిక్‌ డబ్బాల్లోని ఆహారం తినడం వల్ల, సౌందర్య సాధనాలను వినియోగించడం వల్ల... వాటిలోని రసాయనాలు పుట్టబోయే బిడ్డల ప్రజ్ఞాస్థాయిని ప్రభావితం చేస్తాయట. గర్భిణుల్లో హానికర రసాయనాల స్థాయి ఎక్కువగా ఉంటే, వారికి పుట్టే బిడ్డల్లో వివేక స్థాయులు తక్కువగా ఉంటాయని నిర్ధరణకు వచ్చినట్టు పరిశోధకులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. క్వార్టర్స్‌లో సింధు, సైనా

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్‌ దాటలేకపోయిన సైనాకు తాజా విజయంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ శెట్టి జంట ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చి క్వార్టర్స్‌కు చేరుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.