
తాజా వార్తలు
రాంచీ: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంట్లో భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సందడి చేశాడు. ధోనీతో కలిసి ఉన్న ఫొటోని పంత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన గంటలోనే 1.98 లక్షల లైకులు వచ్చాయి. ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకున్న పంత్ తన ప్రతిభకు తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. చెత్త షాట్లతో పెవిలియన్‌కు చేరుతున్నాడు. దీంతో అతడి స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. అతడి స్థానంలో ఆడిన వృద్ధిమాన్ సాహా బ్యాటింగ్‌లో రాణించలేకపోయినా క్లిష్టమైన క్యాచ్‌లను అందుకొని ప్రశంసలు దక్కించుకున్నాడు. పరిమిత ఓవర్లలోనూ పంత్‌కు పోటీ తప్పేలా లేదు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ సిరీస్‌కు వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో సంజు మెరుగైన ప్రదర్శన చేస్తే జట్టులో చోటు నిలబెట్టుకోవడానికి పంత్ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భారత్ తరఫున పంత్ 11 టెస్టులు, 12 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 754, వన్డేల్లో 229. టీ20ల్లో 325 పరుగులు చేశాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
