close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. హుజూర్‌నగర్‌లో నేడు ప్రజాకృతజ్ఞత సభ

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు తెలంగాణ రాష్ట్రసమితి శనివారం భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంపై ఆయన వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. వైకాపాలోకి ఎమ్మెల్యే వంశీ?

ఉదయమంతా భాజపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో తిరిగారు.. సాయంత్రం అయ్యేసరికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత సెల్‌ఫోన్‌ ఆపేశారు. దాంతో.. తెదేపాకు చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఇక వైకాపాలో చేరడం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. అయితే ‘‘దీపావళి తర్వాత మండలాల్లో పర్యటించి, నా నిర్ణయం ప్రకటిస్తాను. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’’ అని వంశీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఓటరు జాబితాలో పేర్లున్నాయో లేదో చూసుకోండి

తెలంగాణలోని పురపాలికలు, నగరపాలక సంస్థలకు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పురపాలక సంఘాలు గత జులై 16న వార్డుల వారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాలో పేర్లున్నాయో లేదో సరిచూసుకోవాలని ప్రజలకు సూచించింది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 2019 జనవరి ఒకటి వరకూ కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ల జాబితానే పురపాలక ఎన్నికలకు ప్రాతిపదిక అని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. డ్రైవింగ్‌ లైసెన్స్‌కు చదువు అక్కరలేదు

ఆటో, కారు, బస్సు, లారీ ఇటువంటి రవాణా వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే ఇకపై విద్యార్హత అవసరం లేదు. 8వ తరగతి వరకుచదివిన వారికే లైసెన్స్‌ ఇవ్వాలన్న నిబంధన 12 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చింది. దీనిని సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 

5. రూ. కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలు లీజుకు

వరంగల్‌ నగరంలో ఆర్టీసీకి చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడం చర్చనీయాంశమవుతోంది. హన్మకొండ హంటర్‌ రోడ్డులో టైర్‌ రీ ట్రేడింగ్‌ వర్క్‌షాపు స్థలం సుమారు నాలుగు ఎకరాలను గతంలో వరంగల్‌ తెరాస ఎంపీ పసునూరి దయాకర్‌కు చెందిన రోనీ భారత్‌ కంపెనీకి లీజుకిచ్చారు. తాజాగా వరంగల్‌ నగరంలో ఆర్టీసీకి చెందిన మరో విలువైన స్థలాన్ని ప్రభుత్వం లీజుకిచ్చింది. హన్మకొండ లోకల్‌ డిపో ఎదురుగా ఉన్న సుమారు రెండెకరాల జాగాను ఒక ప్రయివేటు నిర్మాణ సంస్థకు అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. హరియాణాలో కమలమే!

హంగ్‌ ఏర్పడిన హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా భాజపా చకచకా అడుగులేస్తోంది. స్వతంత్ర ఎమ్మెల్యేలంతా మద్దతిచ్చేందుకు ముందుకొచ్చారు. మరోవైపు 10 స్థానాలను గెల్చుకున్న దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జన్‌నాయక్‌ జనతా పార్టీ ప్రభుత్వంలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కమలదళాధిపతి అమిత్‌షాను దుష్యంత్‌ చౌతాలా శుక్రవారం కలుసుకున్నారు. దుష్యంత్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వొచ్చని గట్టిగా వినిపిస్తోంది. కొత్త ప్రభుత్వానికి మళ్లీ మనోహర్‌లాల్‌ఖట్టరే నేతృత్వం వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. శిల్పారామం వద్ద గాల్లో తేలియాడే క్లౌడ్‌ డైనింగ్‌ హోటల్‌

8. తండ్రిని పోషించని తనయకు శాస్తి

అష్టకష్టాలుపడి పెంచిన తండ్రి వద్దు. ఆయనకు చెందిన రూ.కోట్ల ఆస్తి మాత్రం కావాలి. పట్టెడన్నం పెట్టడానికి చేతులు రాకపోవడం అటుంచి, ఎలాగోలా బతుకీడుస్తున్న ఆయనకు నరకం చూపించిందా కూతురు. తీవ్రంగా స్పందించిన అధికారులు తండ్రి రిజిస్ట్రేషన్‌ చేసిచ్చిన రూ. 3.80 కోట్ల విలువైన భూమిని ఆమె నుంచి వెనక్కి తీసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. వీసా లేకుండానే బ్రెజిల్‌కు వెళ్లొచ్చు!

దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌ను సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇక వీసా అవసరం లేకుండానే ఈ దేశానికి మనం వెళ్లొచ్చు. చైనా, భారత పర్యాటకులు, వాణిజ్యవేత్తలు వీసాలతో పనిలేకుండా తమ దేశానికి రావొచ్చని బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బోల్సొనారు శుక్రవారం ప్రకటించారు. అమెరికా, కెనడా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలవారికి వీసా నిబంధనల్ని బ్రెజిల్‌ ఇప్పటికే ఎత్తేసింది. 

10. కర్ణాటకదే విజయ్‌ హజారె ట్రోఫి

విజయ్‌ హజారె ట్రోఫీని కర్ణాటక కైవసం చేసుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (52 నాటౌట్‌), మయాంక్‌ అగర్వాల్‌ (69 నాటౌట్‌) అర్ధశతకాలతో రాణించారు. పుట్టిన రోజు నాడు పేసర్‌ అభిమన్యు మిథున్‌ (5/34) హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్లతో విజృంభించడంతో ఫైనల్లో కర్ణాటక 60 పరుగుల తేడాతో తమిళనాడుపై గెలిచింది. మరోవైపు ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ పోరాటం ముగిసింది. డబుల్స్‌లో జోరు కొనసాగించిన సాత్విక్‌ సాయిరాజు-చిరాగ్‌ శెట్టి జోడీ సెమీస్‌లో అడుగుపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.