
తాజా వార్తలు
అమరావతి: దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన రోగులకు ఆర్థిక సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించనుంది. పోస్ట్ ఆపరేటివ్ సస్టెయినెన్స్ అలవెన్సు కింద రోజుకు రూ.225 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో సర్జరీ తర్వాత పేద రోగులకు ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సర్జరీ అనంతరం రోగికి రోజువారీ అలవెన్సు కింద రూ.225 ఇవ్వాలని నిర్ణయించారు. నెలకు గరిష్టంగా రూ.5వేలు మించకుండా పోస్ట్ ఆపరేటివ్ సస్టెయినెన్స్ అలవెన్స్ కింద ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు నిధుల నుంచి రోగులకు ఈ అలవెన్సు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి మాత్రమే ఈఅలవెన్సును వర్తింపజేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 2019 డిసెంబరు 1 నుంచి అలవెన్సు పంపిణీ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
రోగులకు పింఛన్
అరుదైన వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని మరికొన్ని వ్యాధులకు వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు నెలవారీ పింఛన్లను అందించేందుకు మరో ఆరు వ్యాధులను నోటిఫై చేస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వ్యాధి కలిగిన రోగులకు రూ.10వేలు, గ్రేడ్- 4 స్థాయిలో ఉన్న బోదకాలు వ్యాధిగ్రస్తులకు, పక్షవాతం, మస్క్యులర్ డిస్ట్రోఫీ, ప్రమాదాల బారిన పడి మంచాన పడిన వారికి, తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి రూ.5వేలు చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆదేశాలు 2020 జనవరి 1 నుంచి వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- వదిలేశారు..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
