
తాజా వార్తలు
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు బెంగళూరులో అపూర్వ స్వాగతం లభించింది. తిహాడ్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఆయన దిల్లీ నుంచి బెంగళూరువిమానాశ్రయానికి చేరుకోవడంతో భారీగా అభిమానులు, మద్దతుదారులు అక్కడికి చేరుకొని ఘనంగా స్వాగతం పలికారు. 250 కిలోల యాపిల్ పండ్లతో గజమాలను రూపొందించి ఆయన పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ గజమాలను వేసేందుకు రెండు క్రేన్లను వినియోగించారు. ఆయన రాకతో విమానాశ్రయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంతో పాటు బాణసంచా కాల్చి తమ సంతోషం వ్యక్తంచేశారు. అనంతరం డీకేఎస్‌ను విమానాశ్రయం నుంచి కేపీసీసీ కార్యాలయానికి ర్యాలీగా తీసుకొచ్చారు. కారులో ర్యాలీగా వెళ్తూ తన మద్దతుదారులకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు.
మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను గత నెలలో తిహాడ్ జైలుకు తరలించారు. ఇన్నాళ్లు పాటు జైలులో ఉన్న డీకేఎస్‌కు రూ.25లక్షల బాండుతో సహా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు, విదేశాలకు వెళ్లకుండా షరతులు విధిస్తూ దిల్లీ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బుధవారం రాత్రి తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
