close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. పారిశ్రామిక పార్కు శంకుస్థాపనకు తేదీ ఖరారు

తెలంగాణలో హరిత పారిశ్రామిక పార్కు శంకుస్థాపనకు ముహూర్తం కుదిరింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వాసుల కల త్వరలో నెరవేరనుంది. నవంబరు 1న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా పార్కు శంకుస్థాపనకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతకుముందే పార్కులో యూనిట్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. 12 లక్షల ఇళ్లు కావాలి: ఏపీ

ఏపీ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పేదలకు 12 లక్షల ఇళ్లు అవసరమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించనుంది. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్‌) తయారు చేసే పనిలో గృహ నిర్మాణశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. 2022 నాటికి పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా ఎన్ని ఇళ్లు అవసరమో నివేదించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. టీఎంయూ జెండా రంగు మారింది

ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ) జెండా రంగు మారింది. ఇప్పటివరకు తెరాసకు అనుబంధంగా వ్యవహరించిన టీఎంయూ జెండా గులాబీ రంగులో ఉంది. తాజాగా దాన్ని తెలుపు రంగునకు మార్చుకుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ సంఘానికి మధ్య దూరం పెరగడంతో జెండా రంగును మార్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. విశాఖ నుంచి కొత్త విమానాలు

ట్రూజెట్‌, స్కూట్‌ విమానయాన సంస్థలు విశాఖపట్నం కేంద్రంగా ఆదివారం నుంచి తొలిసారి విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్థలు అదనపు విమానాల్ని నడపనున్నాయి. సింగపూర్‌కు మళ్లీ విమానాలు మొదలవుతున్నాయి. స్పైస్‌జెట్‌ విశాఖ- విజయవాడ- విశాఖ- చెన్నై సర్వీసును ఆదివారం ప్రారంభిస్తోంది. వారానికి 6 రోజులు నడుస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. గ్రామ వాలంటీర్ల భర్తీకి సిద్ధం

ఏపీలో మిగిలిపోయిన 9,674 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. నవంబరు 1న జిల్లాల వారీగా ప్రకటన జారీ చేసి 30లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో భాగంగా బీసీ, ఓసీ అభ్యర్థుల కటాఫ్‌ మార్కులను తగ్గించనున్నారు. దీనిపై 2, 3 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. 5.51లక్షల దీపాలతో అయోధ్య నగరం అలంకరణ

7. సరిహద్దుల్లో మోదీపావళి!

సరిహద్దుల్లో కఠిన పరిస్థితుల మధ్య దేశ రక్షణ బాధ్యతలు చూస్తున్న భద్రతా సిబ్బందితో దీపావళి పర్వదినాన్ని జరుపుకొనే ఆనవాయితీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఆయన జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి సైనిక శిబిరాలను ఆదివారం సందర్శించే వీలుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. పరిహారం చెల్లించకపోవడం సేవా లోపమే

పాలసీదారు చనిపోయినపుడు పాలసీ సొమ్మును నామినీలకు చెల్లించకపోవడం సేవాలోపమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ స్పష్టం చేసింది. వ్యాధి ఉన్న విషయాన్ని దాచిపెట్టారన్న కారణంగా పాలసీ సొమ్మును చెల్లించడం కుదరదనడం సరికాదంది. రెండు పాలసీల మొత్తం రూ.3.50 లక్షలను బోనస్‌తోపాటు 9 శాతం వడ్డీతో చెల్లించాల్సిందేనంటూ కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఎంఎస్‌కే జైశ్వాల్‌ తీర్పు వెలువరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భారత్‌కు వార్షిక రుణసాయం కొనసాగింపు

భారత్‌కు సుమారు రూ.42వేల కోట్ల పై చిలుకు వార్షిక రుణసాయం కొనసాగుతుందని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్పాస్‌ శనివారంనాడు వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు రుణసాయంతో భారత్‌లో దాదాపు 97 పథకాలు అమలవుతున్న విషయం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఫైనల్లో సాయిరాజ్‌,  చిరాగ్‌ జోడీ

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం  జరిగిన సెమీఫైనల్లో భారత జంట 21-11, 25-23తో హిరోయుకి ఎండో- యుతా వతనబె (జపాన్‌) ద్వయంపై విజయం సాధించింది. సాత్విక్‌, చిరాగ్‌ మినహా టోర్నీలో పోటీపడ్డ భారత షట్లర్లంతా నిష్క్రమించిన సంగతి తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.