
తాజా వార్తలు
రామ్‌దాస్ అథవాలే వ్యాఖ్యలు
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. 56 స్థానాలు గెలిచి కింగ్ మేకర్‌గా మారిన శివసేన ముఖ్యమంత్రి పదవిపై పట్టు వీడటం లేదు. భాజపా లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని అడుగుతోంది. ఈ సమయంలో తాజాగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఆర్పీఐ అధినేత రామ్‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పదవులు పంపకంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ..
‘మహారాష్ట్రకు దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగానూ, శివసేన నుంచి ఆదిత్య ఠాక్రే ఉపముఖ్యమంత్రిగా పూర్తికాలం ఉంటే మంచిది. ఐదేళ్లపాటు జూనియర్ ఠాక్రే డిప్యూటీ సీఎంగా ఉండే ఆఫర్‌ను అంగీకరించాలి. ప్రజలు వారి వైపు ఉండాలంటే ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయాలి. ప్రస్తుతం భాజపా-శివసేన మధ్య నడుస్తున్న ఈ చిన్న సమస్య ఎన్నో రోజులు ఉండదు. నాలుగైదు రోజుల్లో పరిష్కారం అవుతుందని భావిస్తున్నాను. రెండు పార్టీలు కూలంకషంగా చర్చించుకుంటే సమస్య పరిష్కారమవుతుందని అనుకుంటున్నాను. దీనిపై నేను వారితో మాట్లాడతాను’ అని అన్నారు. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని పంచుకోవడంపై శివసేన ఒకే మాటపై ఉంది. తొలి 2.5 సంవత్సరాలు ఆదిత్య ఠాక్రే, మలి 2.5 సంవత్సరాలు దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ఉండాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం రిమోట్ తమ చేతిలో ఉందని, భాజపా తమ డిమాండ్‌కు తలొగ్గకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని చెబుతోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
