close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. సుజిత్‌ కథ విషాదాంతం..!

తమిళనాడులో బోరు బావిలో పడిన బాలుడు సుజిత్‌ (2) మృతి చెందాడు. బాలుడి మృతిని అధికారులు ధృవీకరించారు. తిరుచ్చి జిల్లా నడుకాట్టుపట్టిలోని బోరుబావిలో శుక్రవారం సాయంత్రం సుజిత్‌ పడిన విషయం తెలిసిందే. భౌతికకాయం పూర్తిగా కుళ్లినట్లు  గుర్తించిన అధికారులు బోరు బావి నుంచి సుజిత్‌ మృతదేహాన్ని వెలికితీసి మనప్పరాయ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుజిత్‌ మృతదేహానికి పలువురు తమిళనాడు మంత్రులు నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఒకట్రెండు రోజుల్లో మంత్రి మండలి సమావేశం!

తెలంగాణ మంత్రి మండలి సమావేశం ఒకట్రెండు రోజుల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం జారీ చేసిన మోటారు వాహనాల సవరణ చట్టం-2019 అమలు, ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వడం తదితర ప్రతిపాదనలనూ మండలి ఎజెండాలో చేర్చనున్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. రూ.60 వేల కోట్లతో..  గోదావరి, కృష్ణా అనుసంధానం

గోదావరి- కృష్ణా అనుసంధానంపై పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయించాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పోలవరం నుంచి ఆంధ్రప్రదేశ్‌ భూభాగం మీదుగానే బనకచర్ల రెగ్యులేటర్‌కు గోదావరి నీటిని తరలించే ఈ ప్రతిపాదనపై నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఇందుకు రూ.60వేల కోట్లు ఖర్చవుతుందని లెక్కించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. గురుకులం.. కొలువు భారం

తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. ఏడాదిన్నరలో దాదాపు 800 మందికి పైగా టీచర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఇతర కొలువుల్లో చేరారు. కార్పొరేట్‌ విద్యా విధానం పేరిట మంచి మార్కులు, ఫలితాల కోసం టీచర్లపై భారం పెంచుతున్నారు. విద్యార్థులకు కనీస మార్కులు రాకున్నా, ఫలితాల్లో అరశాతం తగ్గినా మెమోలు ఇస్తుండటం, టీఆర్టీ పోస్టుల భర్తీ నేపథ్యమే కారణమని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. వచ్చే నెలలో రాయదుర్గం.. డిసెంబరులో జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మెట్రో ..!

రాయదుర్గం మెట్రో స్టేషన్‌ను వచ్చేనెలలో ప్రారంభించనున్నారు. దీపావళి నాటికే అందుబాటులోకి తీసుకొస్తామని మెట్రో అధికారులు చెప్పినా.. అనుమతుల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆలస్యమవుతోంది. మరిన్ని రోజులు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇక జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మార్గం డిసెంబరుకు అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. మెట్రోరైలు ప్రాజెక్ట్‌లో కారిడార్‌-3 నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు వెళుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఖాదీ వస్త్రాలను వినియోగించండి: యూజీసీ

స్నాతకోత్సవాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో విద్యార్థులు, ఉద్యోగులు ఖాదీ, చేనేత వస్త్రాలను ధరించేలా విశ్వవిద్యాలయాలు చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) వర్సిటీలను కోరింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాలకు లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం కోసం క్లిక్‌ చేయండి 

7. భారతీయుల మెదడుకు ప్రత్యేకంగా అట్లాస్‌

చైనా, కొరియన్‌, తెల్లజాతీయులతో పోలిస్తే భారతీయుల మెదడుకు ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ ఐటీ ఆచార్యుల బృందం గుర్తించింది. ఎత్తు, వెడల్పు, పరిమాణంలో చిన్నగా ఉన్నట్లు తేలింది. ఇందుకు తగ్గట్టుగా భారతీయులకు ఉపయోగపడేలా మెదడు అట్లాస్‌ (బ్రెయిన్‌ అట్లాస్‌)ను తయారు చేశారు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ వంటివి తీసే సమయంలో ఇది ఎంతో ఉపయోగపడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మహిళల భద్రతకు కేజ్రీవాల్‌ మరో నిర్ణయం

దేశ రాజధాని దిల్లీలో మహిళల భద్రత దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళల భద్రత కోసం ప్రభుత్వ బస్సుల్లో(డీటీసీ) ప్రస్తుతం నియమించిన 3400 మంది మార్షల్స్‌ను 13వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం నుంచి నూతనంగా నియామకమైన అదనపు మార్షల్స్‌ విధుల్లోకి చేరనున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కోల్‌కతాలో తొలి డే/నైట్‌ టెస్టు!

బీసీసీఐ కొత్త అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ పట్టుదలగా ఉండడంతో రాబోయే బంగ్లాదేశ్‌ సిరీస్‌లోనే భారత్‌ తన తొలి డే/నైట్‌ టెస్టు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ... బంగ్లా బోర్డుకు ప్రతిపాదన కూడా పంపింది. ఈనెల 22న ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగే రెండో టెస్టును డే/నైట్‌లో నిర్వహిస్తామనే ఈ ప్రతిపాదనకు బంగ్లా బోర్డు అంగీకారం తెలిపితే చాలు.. గులాబి టెస్టు మజాను భారత అభిమానులు కూడా ఆస్వాదించొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. దేవతలకు నైవేద్యంగా 3500 వంటకాలు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.