
తాజా వార్తలు
దిల్లీ: మహిళల భద్రత కోసం దిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత రవాణా సౌకర్యం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇకపై దిల్లీలోని మహిళలు ప్రభుత్వ బస్సులు, క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చెయ్యొచ్చు. భాయ్ దూజ్‌ను పురస్కరించుకుని ఈ పథకాన్ని మంగళవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు సోమవారం రాత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రభుత్వ, క్లస్టర్ బస్సులు ఎక్కే మహిళలకు పింక్ టికెట్లు ఇస్తారు. ఇందుకు మహిళల నుంచి ఎలాంటి ఛార్జీలు తీసుకోరు. పింక్ టికెట్ల సంఖ్యను బట్టి ప్రభుత్వం ఆ మొత్తాన్ని దిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు చెల్లిస్తుంది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ‘ఈ ఉచిత రవాణా సదుపాయం.. మహిళకు భద్రత కల్పించడమేగాక, దిల్లీ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను కూడా పెంచుతుంది’ అని అన్నారు.
భాయ్ దూజ్‌ను పురస్కరించుకుని అక్టోబరు 29 నుంచి ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఆగస్టు 29న దిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేగాక.. మహిళల భద్రత కోసం ప్రభుత్వ బస్సుల్లో ప్రస్తుతం నియమించిన 3400 మంది మార్షల్స్‌ను 13వేలకు పెంచుతూ కేజ్రీవాల్ నిన్న నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- బాపట్లలో వింత శిశువు జననం
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
