close

తాజా వార్తలు

ఇసుక ధర పెరగడం జగన్నాటకమే: చంద్రబాబు

విజయవాడ: బస్తా సిమెంట్‌ కంటే ఇసుక ధర ఎక్కువగా ఉండటం జగన్నాటకమే అని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా తెదేపా విస్త్రృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడిందనడం అబద్ధమన్నారు. ఇసుక విధానం మార్చకుండా ఉంటే రాష్ట్రంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకునేవారు కాదని చెప్పారు. ‘ తెదేపా హయాంలో హాయిగా బతికిన ప్రజలు ఇప్పుడు కష్టాలు కొనితెచ్చుకున్నారు. ఇరిగేషన్‌లో మీకు ఓనమాలు రావని ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పాం. ఇప్పుడు నేను చెప్పిందే అనుసరించాల్సి వస్తోంది’ అని చంద్రబాబు అన్నారు. దేశంలో రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెదేపానే అని గుర్తు చేశారు. రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘కౌలు రైతులు వేరే కులం వారైతే రైతు భరోసా ఇవ్వరట. ఇదెక్కడి న్యాయం’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

దోమలపై దండయాత్రను అసెంబ్లీలో ఎగతాళి చేశారని, ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్‌ తీసేసి దోమలమయం చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘ ఇంటికొకరు డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇక పోరాటం తప్పదు. నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే పోరాడే వారికి అండగా నిలుస్తా. జగన్‌ చేతకానితనాన్ని ఇప్పుడు కేసీఆర్‌ కూడా ఎగతాళి చేస్తున్నారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రెవెన్యూ శాఖ ద్వారా ఎమ్మెల్యే వంశీ పట్టాలు ఇప్పిస్తే ఆయనపై కేసులు పెడతారా? అని చంద్రబాబు మండిపడ్డారు. వంశీని లొంగదీసుకోవాలని తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల కేసులో వంశీకి సంబంధమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. వంశీకి అండగా ఉంటామని, న్యాయం కోసం పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.