
తాజా వార్తలు
దిల్లీ: సంపదను నిల్వ చేసినప్పుడు కంటే దానిని దానం చేసినప్పుడే అసలైన గౌరవమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ ఆర్థికాభివృద్ధికోసం సంస్థలు వినూత్న పరిష్కార మార్గాలతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశంలో అనాథలు, దివ్యాంగుల సాంఘిక సంక్షేమం కోసం మరింత వ్యయాన్ని వెచ్చించేందుకు కృషి చేయాలని కార్పొరేట్ కంపెనీలకు రాష్ట్రపతి సూచించారు. సీఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా కార్పొరేట్ సంస్థల సామాజిక సేవలకు గుర్తింపుగా ఆయా కంపెనీలకు పురస్కారాలను అందజేశారు. కార్పొరేట్ అవార్డు ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ సీఎస్ఆర్ కేటగిరిలో 19 కంపెనీలకు అవార్డులు ఇచ్చారు. వీటిలో మహింద్రా, టాటా, పరన్ జేప్ ఆటోకాస్ట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సహా పలు కంపెనీలు అవార్డులు సొంతం చేసుకున్నాయి. 2014లో అమల్లోకి వచ్చిన సీఎస్ఆర్ నిబంధనల ప్రకారం కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవలకు ఖర్చు చేస్తున్న నిధుల ఆధారంగా ఈ అవార్డులు అందజేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
