close

తాజా వార్తలు

ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి తన ఛాంబర్‌లో సైదిరెడ్డితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప సభాపతి పద్మారావు, మంత్రులు మహమూద్‌ అలీ, ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం సైదిరెడ్డిని మంత్రులు అభినందించారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ తాను అసెంబ్లీలో అడుగుపెట్టడం పూర్వజన్మ సుకృతం అన్నారు. హుజూర్‌నగర్‌ అభివృద్ధే తన అజెండా అని.. అక్కడి ప్రజలకోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.