close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూత

సీనియర్‌ సినీనటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాకినాడలో జన్మించిన ఈమె.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌

దేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూ-కశ్మీర్‌ భౌగోళిక పటం రూపురేఖలు మారిపోయాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన నరేంద్ర మోదీ సర్కారు 90 రోజుల్లోగానే జమ్మూ-కశ్మీర్‌కు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కలానికి కేసుల కళ్లెం

ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా పత్రికలు, టీవీ ఛానళ్లు నిరాధార వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా కేసులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులపైనా చర్యలు తీసుకోనుంది. ఆ వార్తలు, కథనాలు నిరాధారమైనవని భావిస్తే, సంబంధిత ప్రచురణకర్తలు, సంపాదకులపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకే కట్టబెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. డెంగీ మరణాలపై నిర్ధారణ కమిటీ

రాష్ట్రంలో డెంగీ మరణాలను నిర్ధారించడానికి తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని బుధవారం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ మరణాలపై పత్రికల్లో వస్తున్న కథనాలను పరిశీలించడం, సంబంధిత సమాచారాన్ని జిల్లాల నుంచి సమీకరించడం, దాని ఆధారంగా మరణాలకు కారణాలను నిర్ధారించడంపై కమిటీ దృష్టిపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఉద్యోగార్థులకు 15 గ్రేస్‌ మార్కులు

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ కేటగిరీల పోస్టులకు పరీక్షలు రాసిన వారందరికీ 15 చొప్పున గ్రేస్‌ మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు అదనపు మార్కులు జత చేసి అర్హత సాధించిన అభ్యర్థులతో జాబితాలు రూపొందించి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. తితిదేలో భారీగా ఉద్వాసనలు

తిరుమల, తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సిబ్బందికి ఉద్వాసన పలకాలని తితిదే నిర్ణయించింది. ఈ ప్రభావం సుమారు వంద మందిపై పడనుంది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సిబ్బందిని తక్షణమే తొలగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తితిదే ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రికి కూడా ఈ నిబంధన వర్తించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కాంట్రాక్టు వ్యవసాయానికి కేంద్రం ఆమోదముద్ర

రైతుల ఆదాయం వృద్ధి చేసే దిశగా దేశంలోనే తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. దీంతో దేశంలోనే తొలిసారిగా కాంట్రాక్టు వ్యవసాయంపై చట్టాన్ని రూపొందించి అమలు చేస్తున్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కొత్తగా 100 విమానాశ్రయాలు

వచ్చే ఐదేళ్లలో (2024 కల్లా) మన దేశంలో అదనంగా 100 విమానాశ్రయాలను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఉద్దేశంలో భాగంగా ఈ దిశగా ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. 2025 కల్లా మౌలిక సదుపాయాల అవసరాలపై గతవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. 370 రద్దు భారత్‌ అంతర్గతం: ఈయూ ఎంపీలు

జమ్మూ-కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేయడం భారతదేశ అంతర్గత వ్యవహారమని ‘‘యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటు’’ సభ్యులు పేర్కొన్నారు. తమ పర్యటనపై రేకెత్తిన వివాదం, విపక్షాల విమర్శల నేపథ్యంలో ఈయూ ఎంపీలు ఈ మేరకు స్పందించారు. ప్రపంచానికే బెడదగా మారిన ఉగ్రవాదంపై పోరులో తామంతా భారత్‌కు అండగా నిలుస్తామని ఉద్ఘాటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఆసియా కప్‌ భారత మహిళలదే

వర్ధమాన మహిళల ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్లో భారత్‌ విజేతగా నిలిచింది. బుధవారం డక్‌వర్త్‌/లూయిస్‌ పద్ధతిలో ఫలితం తేలిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఆతిథ్య శ్రీలంకపై విజయం సాధించారు. మరోవైపు వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో  జరిగే టీ20 ప్రపంచకప్‌కు స్కాట్లాండ్‌, నమీబియా అర్హత సాధించాయి. పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ ఇప్పటికే అర్హత పొందాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.