close

తాజా వార్తలు

పవన్‌ ఫొటో చూసి స్ఫూర్తి పొందిన చెర్రీ

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఫొటోలను చూసి స్ఫూర్తి పొందారు టాలీవుడ్‌ నటుడు రామ్‌ చరణ్‌. ఇటీవల పవన్‌కల్యాణ్‌ తన వ్యవసాయ క్షేత్రంలోని గోవులతో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా జనసేన పార్టీ విడుదల చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు చూసిన మెగా  అభిమానులు గోవుల మధ్య గోపాలుడు అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ సైతం ఇన్‌స్టా వేదికగా పవన్‌ ఫొటోలను షేర్‌ చేశారు. తాను కూడా భవిష్యత్తులో గోశాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. ‘ఈ ఫొటోలను చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను. త్వరలో గోశాలను ప్రారంభించాలనుకుంటున్నాను’ అని రామ్‌ చరణ్‌ పేర్కొన్నారు.

ఈ ఏడాది విడుదలైన ‘వినయ విధేయ రామా’ చిత్రంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ ఫలితాన్ని అందుకున్నారు నటుడు రామ్‌చరణ్‌. మరోవైపు ఇటీవల విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతా రామరాజుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో చెర్రీ జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ నటించనున్నారు. 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.