close

తాజా వార్తలు

భారత యువతకు విదేశీ ఉద్యోగాలు..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు రోజుల క్రితం సౌదీ అరేబియాలో పర్యటించిన ప్రధాని మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య నైపుణ్యం గల మానవవనరుల వలసలు స్వేచ్ఛగా జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇది ఆచరణలోకి వస్తే భారతీయులకు వరంగా మారే అవకాశం ఉంది. అలాగే నైపుణ్యం గల ఉద్యోగుల కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్న ఐరోపా దేశాలకూ ఇది లాభసాటిగా మారనుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశాల మధ్య ఈ తరహా ఒప్పందాలు కుదరడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా పరిణమించిన నిరుద్యోగ కొరత తగ్గుముఖం పడుతుందన్నారు. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. వాణిజ్య ఒప్పందాల్లో ఈ ప్రతిపాదనను భాగం చేయాల్సిన అవసరం ఉందని మరికొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు పెట్టుబడులు, ముడిసరుకులు, ఉత్పత్తులు, సేవల మార్పిడికే పరిమితమైన ఒప్పందాలు ఇకపై మానవవనరులకు కూడా విస్తరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అజయ్‌ దువా తెలిపారు. 

మోదీ తాజా ప్రతిపాదన.. నైపుణ్యం గల ఉద్యోగుల కొరత ఎదుర్కొంటున్న ఐరోపా దేశాలతో పాటు జపాన్‌, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన చెందిన దేశాలకు కూడా లాభసాటిగా ఉంటుందని నిపుణులు తెలిపారు. అయితే, ఆయా ఉద్యోగాలను భారతీయులు ఆక్రమించుకోడంపై విదేశాలు చింతించాల్సిన అవసరం లేదని అభిప్రాపడుతున్నారు. అత్యంత నైపుణ్యం గలవారే అక్కడి వరకు చేరుకోగలరు. కాబట్టి.. ఆయా దేశాల ఆర్థికవృద్ధికి వారంతా దన్నుగా నిలుస్తారన్నారు. ఆంగ్ల భాషతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాల్లో భారతీయులు మెరుగైన స్థాయిలో ఉంటారన్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న కఠిన వలస విధానాలు నైపుణ్యం గల మానవవనరుల వలసలకు అడ్డంకిగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ తాజా ప్రతిపాదన చేసినట్లు అర్థమవుతోందన్నారు. 

‘‘దేశాల మధ్య.. నైపుణ్యం గల మానవ వనరుల వలసలపై ఉన్న నిబంధనల్ని సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను కేవలం ఉత్పత్తులకేగాక, ప్రతిభావంతులైన మానవ వనరుల మార్పిడికి కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది’’ అని మంగళవారం రియాద్‌లో జరిగిన ‘ఫ్యూచర్‌ ఇనిషియేటివ్‌ ఫోరం’ సదస్సులో పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే గల్ఫ్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలో భారతీయుల భాగస్వామ్యాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.