close

తాజా వార్తలు

న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌ ‘తొలి’గెలుపు

ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత పోటీపడ్డ ఇరుజట్లు

ఓవల్‌: వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఇంగ్లాండ్‌ X న్యూజిలాండ్‌ జట్లు శుక్రవారం తలపడిన తొలి టీ20లో ఇంగ్లీష్‌ జట్టు విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు కివీస్‌ను 153/5కు పరిమితం చేసింది. రాస్‌టేలర్‌(44), టిమ్‌సీఫెర్ట్‌(32) రాణించడంతో న్యూజిలాండ్‌ ఒక మోస్తారు స్కోర్‌ సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. జేమ్స్ విన్స్‌(59), ఇయాన్‌ మోర్గాన్‌(34) రాణించడంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బోణీ కొట్టింది. ఈ సిరీస్‌ తర్వాత ఇరుజట్లు రెండు టెస్టులు ఆడనున్నాయి. ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సమాన స్కోర్‌ను సాధించగా సూపర్‌ ఓవర్‌లోనూ చెరో 15 పరుగులు చేయడంతో బౌండరీ కౌంట్‌ ఆధారంగా ఇంగ్లాండ్‌ తొలిసారి ప్రపంచకప్‌ అందుకున్న విషయం తెలిసిందే. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.