close

తాజా వార్తలు

ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొందాం: మోదీ

జర్మనీతో భారత్‌ కీలక ఒప్పందాలు 

దిల్లీ: ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు జర్మనీ, భారత్‌ ద్వైపాక్షిక సహకారంతో పరస్పరం ముందుకెళ్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌.. భారత ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య జరిగిన విస్తృత చర్చల అనంతరం 11 ఒప్పందాలపై సంతకాలు చేశారు. అంతరిక్షం, పౌర విమానయానం, సముద్రపు సాంకేతికత, వైద్యం, విద్య తదితర రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి.  ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 2022 నాటికి నవభారత నిర్మాణ ప్రణాళికకు జర్మనీ సాంకేతిక నైపుణ్యాలు ఎంతో మేలు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐరాసలోని భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ఇరు దేశాల సహకారం కొనసాగుతుందని చెప్పారు. తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లలోని రక్షణ కారిడార్లలో రక్షణ సంబంధ ఉత్పత్తుల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జర్మనీని భారత్‌ కోరింది. ఈ-మొబిలిటీ, స్మార్ట్‌ సిటీలు, నదుల శుద్ధీకరణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై సహకారానికి ఉన్న అవకాశాలపైనా పరస్పరం సహకరించుకోవాలనే అంశంపై చర్చించినట్టు తెలిపారు.

అనంతరం ఏంజెలా మెర్కెల్‌ మాట్లాడుతూ..  ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు దోహదం చేస్తాయని ఆమె తెలిపారు. 5జీ, కృత్రిమ మేథ సవాల్‌గా మారాయని, వాటిపై కలిసి పనిచేయడం ముఖ్యమన్నారు. భారత్‌ చేపట్టిన అతిపెద్ద మౌలికవసతుల ప్రాజెక్టుల్లో పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందని మెర్కెలా అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.