close

తాజా వార్తలు

నాగా గబ్బిలాలతో ఎబోలా!

దిల్లీ: నాగాలాండ్‌లోని గబ్బిలాలు ప్రమాదకర ఎబోలా జాతి వైరస్‌లకు ఆశ్రయమిస్తున్నట్టు తేలింది. సింగపూర్‌లోని ఇయాన్‌ మెండెన్‌హాల్‌, బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. నాగాలాండ్‌లోని మిమీ గ్రామ ప్రజలు... ఆహారం, ఔషధాల కోసం కొన్ని దశాబ్దాలుగా గబ్బిలాలను పెంచుతూ, వాటిని వేటాడుతున్నారు. ఆ గబ్బిలాల ద్వారా ప్రమాదకర ఎబోలా, మార్‌బర్గ్‌ వంటి ఫిలో జాతి వైరస్‌లు సోకుతుండటంతో వాటిని ఎదుర్కొనేందుకు వారిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందుతున్నట్టు తేలింది. ఈ వైరస్‌లు సోకినవారిలో సగం మంది రక్తనాళాలు, అవయవాలు దెబ్బతిని విష జ్వరాలతో మృతిచెందుతున్నారనీ గుర్తించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.