
తాజా వార్తలు
ఎన్సీపీ అధినేత శరద్ పవార్
ముంబయి: శివసేన, ఎన్సీపీ అధినేతలు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ గురువారం సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించినట్లు వస్తున్న వార్తలను పవార్ ఖండించారు. అసలు తమ మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదని తెలిపారు. వీరిద్దరి మధ్య ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరిగినట్లు వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టారు. శివసేన నుంచి ఎటువంటి ప్రతిపాదనా రాలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి మరో 10 రోజుల్లో సమసిపోతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. శివసేన డిమాండ్ విషయంలో భాజపా దిగొస్తుందని జోస్యం చెప్పారు. ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
‘ముంబయిలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. నవంబర్ 9లోపు(అయోధ్య తీర్పు వచ్చేనాటికి) రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పడకపోతే శాంతి భద్రతలకు నష్టం వాటిల్లుతుంది. చిన్నపిల్లల ఆటలు కట్టిపెట్టి వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. నేను ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో చర్చించినట్లు వస్తున్న వార్తల్లోనూ నిజం లేదు. నేను తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాత్రమే మాట్లాడాను. నవంబర్4న విపక్షాల సమావేశం జరిగే అవకాశం ఉంది’ అని తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- రివ్యూ: వెంకీ మామ
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్లో రౌడీషీటర్ దారుణ హత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
