
తాజా వార్తలు
దిల్లీ: భారత్‌లోని పట్టణాల్లో పర్యావరణహిత రవాణా కోసం వచ్చే ఐదేళ్లలో బిలియన్ యూరోల పెట్టుబడులు పెట్టనున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఆమె దిల్లీలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో దేశ రాజధానిలో కాలుష్య స్థాయి అత్యంత ప్రమాదకర స్థితికి పడిపోవడంపై మెర్కెల్ స్పందిస్తూ.. ప్రజా రవాణా కోసం డీజిల్ వాహనాలకు బదులుగా విద్యుత్తు వాహనాలను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.
దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మెర్కెల్ మాట్లాడుతూ.. ‘దిల్లీలో నిన్న కాలుష్యాన్ని చూసిన వారు డీజిల్ బస్సులకు బదులుగా విద్యుత్తు బస్సులను వినియోగించాల్సిన అవసరంపై అద్భుతంగా మాట్లాడగలరు’ అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన మెర్కెల్.. ఇందుకోసం భారత్‌లో బిలియన్ యూరోల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. తమిళనాడులో రవాణా రంగ సంస్కరణల కోసం 200 మిలియన్ యూరోల పెట్టుబడులు పెడతామన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, కృతిమ మేధ తదితర రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
మెట్రోస్టేషన్ సందర్శన..
పర్యటనలో భాగంగా మెర్కెల్ నేడు ద్వారకా సెక్టార్-21 మెట్రో స్టేషన్‌ను సందర్శించారు. అక్కడి ఇ-రిక్షా డ్రైవర్లతో కాసేపు ముచ్చటించారు. ఈ మెట్రో స్టేషన్‌కు జర్మనీతో సంబంధం ఉంది. ఈ స్టేషన్ రూఫ్‌పై ఉన్న సోలార్ ప్యానెళ్లను జర్మనీ ప్రభుత్వ సహకారంతో రూపొందించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
