
తాజా వార్తలు
విశాఖ: రాష్ట్రంలో ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన లాంగ్‌మార్చ్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. ఆదివారం విశాఖ ర్యాలీలో ఆ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు పాల్గొననున్నారు. ఈ మేరకు లాంగ్‌మార్చ్‌లో పాల్గొనాలని ఉత్తరాంధ్రకు చెందిన ముగ్గురు మాజీ మంత్రులకు ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశాలిచ్చింది.
మరోవైపు లాంగ్‌మార్చ్‌కు సంఘీభావం తెలియజేసిన వామపక్ష పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనబోమని ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇసుక సమస్యపై నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి సీపీఐ, సీపీఎంను ఆహ్వానించినందుకు ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణు, మధు ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్‌కల్యాణ్‌కు లేఖ రాశారు. ఈ సమస్యపై తాము సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి భాజపా సహకారం తీసుకోవడానికి జనసేన పార్టీకి అభ్యంతరం లేదనే విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని, ఈ వైఖరి తమకు ఆమోదయోగ్యం కాదని ఒక ప్రకటనలో ఇరు వామపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. అందువల్ల తమ రెండు పార్టీల తరఫున నిరసన కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నామని తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- శ్వేతసౌధంలో ఏకాకి!
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
