
తాజా వార్తలు
హైదరాబాద్: తాను కూడా పీసీసీ రేస్‌లో ఉన్నానంటూ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పీసీసీ అధ్యక్షుడిగా ఒక అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం సహా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని ప్రకటించారు. సీఎల్పీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే పథకాలకంటే.. తన దగ్గర చాలా మంచి వినూత్న పథకాలు ఉన్నాయని తెలిపారు. సీఎం పదవి ఆశించకుండా పని చేస్తానని వెల్లడించారు. ఈ నెల 17న దిల్లీ వెళ్లి సోనియా, రాహుల్, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, కుంతియాని కలుస్తాని అన్నారు. పీసీసీ మార్పు జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయని, అదే నిజమైతే పురపాలక ఎన్నికల ఎన్నికల తర్వాత ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానాన్ని కోరతానని చెప్పారు. ఇప్పుడు పీసీసీ ఆశిస్తున్నా నేతలంతా ఆ పదవికి అర్హులేనని అన్నారు. అధిష్ఠానం ఎవరిని నియమించినా అందరం కలిసి పని చేయాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- 8 మంది.. 8 గంటలు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
