close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. నూతన భారతావని ఆవిష్కరణ

జమ్మూ-కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో నూతన మ్యాప్‌లను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. వీటి ప్రకారం.. జమ్మూ-కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)లో పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) భాగంగా ఉంది. లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంలో గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ అంతర్భాగమైంది. 2 కేంద్ర పాలిత ప్రాంతాలను చూపుతూ కొత్తగా రూపొందిన భారత దేశ మ్యాప్‌నూ కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ

స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా పాత్రికేయులు, మీడియాను గుప్పిట్లో పెట్టుకునే ధోరణితో జీవోలు జారీ చేయడం మంచిది కాదని ప్రెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు జయశంకర్‌ గుప్తా స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వ చర్య అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని, మీడియాను కట్టడి చేసేందుకు వీలు కల్పించే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణలోని మైనార్టీ యువతకు డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పథకం కింద 300 స్విఫ్ట్‌ డిజైర్‌ కార్లను అందించనున్నట్లు మైనార్టీ ఆర్థిక సంస్థ ఛైర్మన్‌ సయ్యద్‌ అక్బర్‌ హుస్సేన్‌ తెలిపారు. 21-40 ఏళ్లలోపు అర్హులైన యువత ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 3 నుంచి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారుల్ని సంప్రదించాలని సూచించారు.

4. ఏపీ నుంచి రిలయన్స్‌ వెనక్కి

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న 2 ఒప్పందాల్లో ఒకదాని నుంచి వైదొలగనున్నట్లు సమాచారం. తిరుపతి సమీపంలో ఏకంగా రూ.15వేల కోట్లతో ఏర్పాటు చేయదలచిన ఎలక్ట్రానిక్‌ పరికరాల ఉత్పత్తి పరిశ్రమ (మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌) ఆలోచనను విరమించుకున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. 200 ఇంజినీరింగ్‌ కళాశాలలను మూసేయండి

ఏపీలో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉన్న 500 డిగ్రీ, 200 ఇంజినీరింగ్‌ కళాశాలలను మూసేయాలని ప్రభుత్వానికి ‘విద్యా సంస్కరణల కమిటీ’ సిఫార్సు చేసింది. 50 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న కళాశాలల్ని, ప్రవేశాలు స్వల్పంగా ఉన్న కోర్సులను మూసివేయాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. సర్కారు ఆసుపత్రిలో రోబోటిక్‌ సర్జరీ

దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి (ఎస్‌జేహెచ్‌)లో అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ శనివారం దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ స్థాయి సదుపాయాలను, నైపుణ్యాలను నిరుపేదలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రధాని మోదీ దార్శనికత అని, ఇందులో భాగంగానే రోబోటిక్‌ సర్జరీని ప్రారంభించామని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. దేశవ్యాప్తంగా మహిళా హెల్ప్‌ డెస్క్‌లు!

దేశవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో మహిళా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు  కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. మనుషుల అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని జిల్లాల్లోనూ మరిన్ని విభాగాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటికోసం ‘నిర్భయ నిధి’ని వినియోగిస్తామన్నారు.

8. ఇక వాట్సప్‌కీ వేలిముద్ర తాళం

ఫోన్‌కి వేలిముద్ర తాళం (ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌) వేసుకున్నట్టే... ఇక నుంచి వాట్సప్‌కీ వేసుకోవచ్చు. ఐఫోన్‌ వినియోగదారుల ఛాటింగ్‌ గోప్యత, భద్రత నిమిత్తం గతంలోనే టచ్‌ఐడీ, ఫేస్‌ఐడీ సదుపాయాలను ఈ యాప్‌ తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో పనిచేసే ఫోన్లను వినియోగించేవారి కోసం ఈ సదుపాయాన్ని తెచ్చింది. ఇప్పటికే మీరు వాట్సప్‌ను వాడుతున్నట్టయితే... ఈ కొత్త సదుపాయం కోసం ముందుగా దాన్ని అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. చలో టోక్యో..

భారత హాకీ జట్లకు ఒలింపిక్‌ బెర్తులు భారత హాకీ జట్లు టోక్యో టికెట్‌ సంపాదించేశాయి. సొంతగడ్డపై మెరిసిన పురుషులు, మహిళల జట్లు ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాన్ని చేజిక్కించుకున్నాయి. క్వాలిఫయర్స్‌ పోరులో రష్యాను చిత్తు చేసి పురుషులు జట్టు.. యుఎస్‌ఏను ఓడించిన అమ్మాయిల బృందం టోక్యో బెర్తులు గెలుచుకున్నాయి. మరోవైపు పొరుగు జట్టు బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నేడు జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. జెరూసలేంలో అతిపెద్ద భూగర్భ శ్మశానవాటిక


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.