
తాజా వార్తలు
కాలుష్యం ధాటికి రాజధాని విలవిల
దిల్లీ: దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. నగరం మొత్తం దట్టంగా అలుముకున్న పొగమంచులో హానికర వాయువులు పెద్ద మొత్తంలో చేరినట్లు కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించింది. దీని దృష్ట్యా ఆదివారం దిల్లీకి రావాల్సిన దాదాపు 32 విమానాలను దారి మళ్లించారు. ఈ మేరకు ఇందిరాగాంధీ విమానాశ్రయ అధికారులు ట్వీట్ చేశారు. దారి మళ్లించిన విమానాల వివరాలను సంబంధిత సంస్థను సంప్రదించి తెలుసుకోవచ్చని సూచించారు. అంతేకాక స్కూళ్లకు సెలవులను మంగళవారం వరకూ పొడిగించారు.
ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 473గా నమోదైంది. ఆనంద్ విహార్, ఆర్కే పురం వంటి చోట్ల ఏక్యూఐ 488, 457గా నమోదైంది.
కాలుష్య తీవ్రత శనివారం ‘అత్యవసర’ స్థాయిలో నమోదైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సూచన మేరకు వాతావరణ కాలుష్య (నియంత్రణ) ప్రాధికార సంస్థ నగరంలో ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించింది. పాఠశాలలు మూసివేయడం సహా కర్మాగారాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
