
తాజా వార్తలు
1. చంద్రబాబుకు కాదు.. ప్రజలకు దత్తపుత్రుడిని: పవన్
కార్మికుల్లో ఎంత ఆవేదన ఉందో రోడ్లపైకి వచ్చిన వారినే చూస్తే తెలుస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో లాంగ్‌మార్చ్ నిర్వహించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ప్రభుత్వం సరిగా పనిచేయనందునే ఇంతమందిలో ఆవేదన పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారన్నారు. వైకాపా నేతల ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రజలకు మాత్రమే తాను దత్తపుత్రుడినని, చంద్రబాబుకుకాదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కేసీఆర్ హామీలనే కార్మికుల అడుగుతున్నారు: భట్టి
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు. కేసీఆర్ మాటలు చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్లుందని ఆరోపించారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి కాబట్టే ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని.. దివాళా తీయించి ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని భట్టి ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కార్మికులు అడుగుతున్నారని గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ‘ఏమిటీ 50-50.. ఏదైనా కొత్త బిస్కెట్టా?’
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎన్నికల్లో కూటమిగా అధిక స్థానాలు గెలిచినప్పటికీ భాజపా-శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం సీఎం పదవీకాలాన్ని 50-50 పంచుకోవాలని శివసేన కోరుతుండగా.. అలాంటి ఒప్పందమేమీ లేదని భాజపా చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో వ్యంగ్య బాణాలు సంధించారు. ‘‘ఏమిటీ 50-50? మార్కెట్లోకి ఏమైనా కొత్త బిస్కెట్ వచ్చిందా?’’ అంటూ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అప్పటిలోగా రాకుంటే పార్టీలతో గవర్నర్ చర్చలు
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 7వ తేదీలోపు ఏ పార్టీ ముందుకు రాకుంటే రాజకీయ పార్టీలతో గవర్నర్ నేరుగా చర్చలు జరపనున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధినేత, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే తెలిపారు. ఈ నెల 9తో 13వ అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నవంబర్ 7 వరకు గవర్నర్ వేచి చూస్తారని, ఒకవేళ ఎవరూ ముందుకు రాని పక్షంలో గవర్నరే స్వయంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన పార్టీలతో చర్చలు జరుపుతారని అథవాలే తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మరింత ఆసక్తిగా ‘మహా’ రాజకీయాలు
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత భాజపా, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అనుకున్నారంతా. ముఖ్యమంత్రి పదవి విషయంలో భాజపా, శివసేనకు మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఈ విషయంలో రోజుకో ప్రకటన చేస్తుండడంతో మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. చర్చలు జరిగితే.. సీఎం పదవిపైనే : శివసేన
ప్రభుత్వ ఏర్పాటుపై మిత్ర పక్షం భాజపాతో చర్చలు జరిగితే అది సీఎం పదవిపైనే జరుగుతాయని శివసేన అదివారం స్పష్టం చేసింది. అయితే, ఇప్పటివరకూ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలేవీ జరగలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అన్నారు. చెరి సగం కాలం సీఎం పదవిని పంచుకోవాలనే శివసేన డిమాండ్‌కు భాజపా అంగీకరించని సంగతి తెలిసిందే. సీఎంగా తానే ఐదేళ్లపాటూ కొనసాగుతానని కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తేల్చి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. వాట్సప్ హ్యాకింగ్: ప్రియాంక ఫోన్ కూడా..
ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ భారత్‌లోని కొందరి ఫోన్లలో వాట్సప్‌లోకి చొరబడిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ స్పైవేర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్లోకి కూడా చొరబడిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఇప్పటివరకూ ఈ స్పైవేర్ ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్లలో చొరబడిందని అన్నారు. ప్రియాంక సహా, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్‌ల ఫోన్లను ఈ స్పైవేర్ పేరుతో ప్రభుత్వమే హ్యాకింగ్ చేయించిందని సుర్జేవాలా ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కోరుట్ల ఎమ్మెల్యే పీఏ గల్లంతు
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పీఏ గల్లంతయ్యారు. అంతర్గాం శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో ఈతకు దిగిన ఎమ్మెల్యే పీఏ గిరీశ్ కనిపించకుండా పోయారు. ముగ్గురు స్నేహితులతో ఈతకు వెళ్లిన ఆయన ఈత రాకపోవడంతో కాల్వలో గల్లంతయ్యారు. గిరీశ్ ఆచూకీ కోసం అంతర్గాంతో పాటు థరూర్ ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఇండో-అమెరికన్ సైనిక విన్యాసాలకు చురుగ్గా ఏర్పాట్లు
10. ధోనీ, కోహ్లీని దాటేసిన రోహిత్
టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ వెనక్కి నెట్టాడు. ధోనీ కంటే ఎక్కువ టీ20లు భారత్ తరఫున ఆడిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా భారత జట్టులోకి వచ్చిన హిట్‌మ్యాన్.. ఇప్పటి వరకు 98 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. అతడి కన్నా ముందు ధోనీ 98 మ్యాచ్‌లతో కొనసాగుతున్నాడు. దీంతో ఆదివారం బంగ్లాదేశ్‌తో తన 99వ మ్యాచ్ ఆడి ఆ మైలురాయిని అధిగమించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- శ్వేతసౌధంలో ఏకాకి!
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
