
తాజా వార్తలు
భవానీపురం, న్యూస్‌టుడే: వంద అబద్దాలైనా ఆడి ఒక పెళ్లి చేయాలంటారు పెద్దలు. అయితే ఓ వ్యక్తి పోన్ చేసి పెళ్లి కొడుకుపై నిజం చెప్పాడో అబద్దం చేశాడో తెలియదు కాని.. ఆ మాటలు ఆ పెళ్లిని ఆపేడంతోపాటు..పెళ్లి కుమారిడి ప్రాణాన్ని తీసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... గొల్లపూడికి చెందిన మరికొండ శ్రీను (19) ఆటోనగర్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఏడాది కాలంలో గొల్లపూడి కరకట్ట ప్రాంతంలో నివాసం ఉండే ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ విషయాన్ని శ్రీను తల్లిదండ్రులు ఫోన్లో అమ్మాయి తరఫు వారికి చెప్పారు. వారు ఇద్దరికీ వివాహం చేసేందుకు ఒప్పుకున్నారు. వారు వచ్చి అబ్బాయి అమ్మానాన్నలతో మాట్లాడారు. అమవాస్య వెళ్లిన తర్వాత పెళ్లి చేద్దామని నిర్ణయించారు. దీనితో శ్రీను ఆ అమ్మాయి ఎంతో సంతోషించారు. ఈ నేపథ్యంలో ఎవరో అమ్మాయి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ‘శ్రీను మంచి వాడు కాదని, గతంలో ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేశాడని’ చెప్పాడు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి వాళ్లకు చెప్పి పెళ్లికి ఒప్పుకోమన్నారు. విషయం తెలిసిన శ్రీను మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
ఎక్కువ మంది చదివినవి (Most Read)
