close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ డిపో డ్రైవర్‌ జైపాల్‌రెడ్డి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి అతని స్వగ్రామం నాంపల్లి మండలం లింగంపల్లిలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు దేవరకొండలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. బంగ్లాదేశ్‌ చేతిలో భారత్‌ పరాజయం

బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌కు ఊహించని ఆరంభం. దిల్లీలో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20లో రోహిత్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా.. 7 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. మొదట బ్యాట్స్‌మెన్‌ తడబాటుతో భారత్‌ 6 వికెట్లకు 148 పరుగులే చేసింది. అనంతరం అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ (60 నాటౌట్‌) బంగ్లాను గెలిపించాడు. సిరీస్‌లో రెండో మ్యాచ్‌ గురువారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. బిగ్‌బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌

బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 3’ విజేతగా తెలుగు గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ నిలిచారు. ఆదివారం జరిగిన ఈ గ్రాండ్‌ ఫినాలేకు ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై విజేతను ప్రకటించారు. బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలుచుకున్న రాహుల్‌ సిప్లిగంజ్‌.. రూ.50 లక్షల పారితోషికాన్ని మెగాస్టార్‌ చేతుల మీదుగా అందుకున్నారు. రన్నరప్‌గా బుల్లితెర వ్యాఖ్యాత శ్రీముఖి నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. విధుల్లోకి 12 మంది

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల నిరసనల హోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పిలుపు మేరకు అక్కడక్కడా కార్మికులు విధుల్లో చేరుతున్నారు. ఆదివారం రాత్రి వరకు 12 మంది విధుల్లో చేరారు. ఉద్యోగాల్లో ఎవరూ చేరవద్దని, సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. 75 శాతం హాజరుంటేనే అమ్మఒడి

అమ్మఒడి పథకం వర్తించాలంటే ఒకటో తరగతి నుంచి ఇంటరు వరకు చదువుతున్న విద్యార్థులకు డిసెంబరు 31 నాటికి 75 శాతం హాజరుండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు హాజరు నివేదికలను తయారు చేయాలని సూచించారు.

6. ఆర్టీసీ భూ విలువ రూ.8,190 కోట్లు

నష్టాలు, అప్పుల్లో కూరుకుపోయిన రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)కు భూములు మాత్రం భారీగానే ఉన్నాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో 1,404 ఎకరాలను ఈ సంస్థ కలిగి ఉంది. అప్పుడు రిజిస్ట్రార్‌ కార్యాలయ లెక్కల ప్రకారం రూ.4,450 కోట్లుగా, మార్కెట్‌ ధర ప్రకారం రూ.8,190 కోట్లుగా అంచనా వేసినట్లు తెలిసింది. అయితే, తాజా ధరల ప్రకారం వీటి విలువ ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ వర్గాలే పేర్కొంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఐటీలో 3వేల ఉద్యోగాలు

3 వేల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించే దిశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేరోజు 19 కంపెనీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంలో ఆయా కంపెనీలు నెల రోజుల్లో కార్యకలాపాలనుప్రారంభించనున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఇవి ఏర్పాటవుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ

ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. సౌదీ అరేబియా ప్రభుత్వరంగ దిగ్గజ చమురు సంస్థ సౌదీ అరామ్‌కో స్టాక్‌ మార్కెట్‌లోకి అరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించింది. సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని తెలిపింది. రియాద్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లను విక్రయించనున్నట్లు అరామ్‌కో స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయంగా నమోదు చేసే ప్రణాళికలేమీ ప్రస్తుతానికి లేవని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ట్రంప్‌ సర్కారు నిబంధన నిలిపివేత

ఇమ్మిగ్రెంట్లకు సంబంధించిన ఆరోగ్యబీమా అంశంపై ట్రంప్‌ సర్కారు నిర్దేశించిన నిబంధన అమలును ఫెడరల్‌ కోర్టు ఒకటి నిలిపేసింది. వీసాల మంజూరు కంటే ముందే ఇమ్మిగ్రెంట్లు ఆరోగ్యబీమాను పొందాలని, లేదంటే వైద్య సంరక్షణ కోసం నిర్దేశిత మొత్తాన్ని చెల్లించగలమని రుజువు చూపాలని ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన అమల్లోకి రాకుండా డిస్ట్రిక్ట్‌ జడ్జి మైఖెల్‌ సైమన్‌ నిలిపేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఒకేసారి వేర్వేరు ఫోన్లలోకి వాట్సప్‌ లాగిన్‌

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ త్వరలో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఫోన్లలోకి లాగిన్‌ అయ్యే వెసులుబాటును వినియోగదారులకు కల్పించనుంది. కొత్త ఫీచర్‌ను మరికొద్దివారాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఐప్యాడ్‌లోనూ వాట్సప్‌ అందుబాటులోకి రానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.