
తాజా వార్తలు
రిషభ్‌పంత్‌పై అభిమానుల చురకలు
దిల్లీ: భారత్ x బంగ్లాదేశ్ జట్ల మధ్య గతరాత్రి జరిగిన తొలి టీ20లో యువకీపర్ రిషభ్‌పంత్ వికెట్ల వెనుక విఫలమయ్యాడు. దీంతో అభిమానులు అతడిని మరోసారి టార్గెట్ చేశారు. తప్పుడు అంచనాలతో టీమిండియాకు నష్టం కలిగించినందుకు ట్విటర్లో అతడిపై జోకులు పేలుస్తున్నారు. ధోనీ స్థానాన్ని పంత్ భర్తీ చేయలేడని వివిధ మీమ్స్‌తో పోస్టులు పెడుతున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లా బ్యాటింగ్ చేస్తుండగా చాహల్ వేసిన 10వ ఓవర్లో సౌమ్యసర్కార్(20) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో ఓ బంతి సౌమ్య బ్యాట్‌కు తాకీతాకనట్టు వెళ్లి నేరుగా పంత్ చేతుల్లో పడింది. దీంతో బ్యాట్స్‌మన్ ఔటయ్యాడని భావించిన పంత్.. అంపైర్ ఔటివ్వకపోయినా, చాహల్‌కు స్పష్టత లేకపోయినా రోహిత్‌శర్మను ఒప్పించి డీఆర్ఎస్ కోరాడు.
సమీక్షలో సౌమ్యసర్కార్ బ్యాట్‌కు బంతి తగలలేదని స్పష్టంగా తేలడంతో భారత సమీక్ష వృథా అయ్యింది. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్‌శర్మ.. పంత్ వైపు చూసి నవ్వుకున్నాడు. ఆ సన్నివేశం చూడటానికి చాలా హాస్యాస్పదంగా అనిపించడంతో ఓ అభిమాని దాన్ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘‘డీఆర్ఎస్ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్ అని రోహిత్..పంత్‌తో అంటున్నాడు’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా రిషభ్‌పంత్ అంతకుముందే మరో చక్కటి అవకాశాన్ని వదిలేశాడు. ముష్ఫికర్ రహీమ్ కుదురుకోకముందే ఎల్బీగా ఔటయ్యే రెండు అవకాశాలను తప్పించుకున్నాడు. పంత్ వాటిని పసిగట్టడంలో విఫలమవడంతో.. అవసరమైనప్పుడు కాకుండా, అనవసరదానికి డీఆర్ఎస్ను వృథా చేశాడని అభిమానులు చురకలు అంటిస్తున్నారు. అలా ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ముఫ్ఫికర్(60నాటౌట్; 43 బంతుల్లో 8x4, 1x6) అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీ20ల్లో టీమిండియాపై బంగ్లాకు తొలి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో బంగ్లా 1-0 తేడాతో మూడు టీ20ల సిరీస్‌లో బోణీ కొట్టింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
