close

తాజా వార్తలు

ఇసుక కొరత తాత్కాలికమే: సీఎం జగన్‌

అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత తాత్కాలిక సమస్య అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. 90 రోజులుగా ఊహించని రీతిలో నదుల్లో వరద వస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 265కి పైగా రీచ్‌ల్లో కేవలం 61 మాత్రమే పని చేస్తున్నాయని, మిగతావన్నీ వరదనీటిలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. రహదారులు, భవనాల శాఖలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరద నీటి వల్ల ఇసుక తీయడం కష్టంగా మారిందని, లారీలు, ట్రాక్టర్లు రీచ్‌ల వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని సీఎం చెప్పారు.
‘ నీళ్లు రావడం పంటలకు, భూగర్భ జలాలకు మంచిదే. నిరంతర వరదల వల్ల ఇసుక సమస్య వస్తోంది. గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచింది. ప్రొక్లెయిన్లు భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేశారు’ అని జగన్ అన్నారు. ప్రస్తుతం తవ్వకాలను మాన్యువల్‌గా చేస్తున్నామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి వెళ్లి చూసినా.. గేట్లు ఎత్తే ఉన్నాయని, నవంబర్‌ నెలాఖరుకు పూర్తిగా సమస్య తీరుతుందని భావిస్తునట్లు సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలను చాలా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించామని, ఇసుక తరలింపునకు కిలోమీటరుకు రూ.4.90కి రవాణా చేసేవారిని రమ్మన్నామని ఆయన అన్నారు. వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుందని సీఎం చెప్పారు. ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇచ్చేందుకు ప్రత్యేక స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.