close

తాజా వార్తలు

ఎక్కడా లేని కొరత ఇక్కడే ఎందుకు?: పవన్‌

విశాఖ: వైకాపా నేతలపై తమకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని.. భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయాలని సూచించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు మృతిచెందారన్నారు. ఇసుకపై ఇతర రాష్ట్రాల్లో లేని ఇబ్బంది ఇక్కడే ఎందుకని ఇసుక కొరతపై నిలదీశారు. భవన నిర్మాణ కార్మికులు ఐదు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారంతా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. అన్నీ ఆపేస్తామంటే ఎలా అని పవన్‌ వ్యాఖ్యానించారు.  కార్మికుల సమస్యలపై ఒక్క సీటు ఉన్న జనసేన పోరాటం చేస్తోందని చెప్పారు. రెండు వారాల్లోపు సమస్య పరిష్కారానికి చొరవ చూపకకపోతే తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వ్యక్తిగత దూషణలు మాని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని వైకాపా నేతలకు పవన్‌ హితవు పలికారు. 

కోరి తెచ్చుకున్న వ్యక్తికి బదిలీ ఎందుకు?
సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారంపై ఈ సందర్భంగా పవన్‌ స్పందించారు. కోరి తెచ్చుకున్న వ్యక్తిని ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు పవన్‌ను అడగ్గా ‘‘అవంతి గారికి కాలేజీలు మూసేసి రాజకీయాల్లో ఉన్నారా? జగన్‌ గారికి జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌ వ్యాపారాలు లేవా?’’ అని ప్రశ్నించారు. సినిమా చేస్తారా అని ప్రశ్నించగా.. చేస్తానో లేదో తనకే తెలీదని.. నిర్మాతగా మాత్రం వ్యవహరిస్తానని పవన్‌ స్పష్టం చేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.