close

తాజా వార్తలు

సుముద్రమట్టాల పెరుగుదలతో భారత్‌కు ముప్పు

బ్యాంకాక్‌: మావనవాళి మనుగడకు వాతావరణ మార్పులు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సుముద్ర మట్టాలు పెరగడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. దీనివల్ల జపాన్‌, చైనా, బంగ్లాదేశ్‌ సహా భారత్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియాన్ సదస్సుకు హాజరైన ఆయన అక్కడి విలేకరులతో మాట్లాడుతూ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. అంచనా వేసిన దానికంటే వేగంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయన్న ఇటీవలి ఓ అధ్యయనాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050నాటికి 300మిలియన్ల మంది ప్రజలు వరద ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు ఏమాత్రం ప్రభావం చూపడం లేదన్నారు. వాతావరణ మార్పులపై మరింత కచ్చితంగా, పటిష్ఠంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.  

ఈ శతాబ్దం చివరినాటికి ఉష్ణోగ్రత పెంపుదలను 1.5డిగ్రీల సెల్సియస్‌కే పరిమితం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని గుటెరస్‌ గుర్తుచేశారు. ఈ దిశగా ప్రభుత్వాలను మేల్కొలిపే దిశగా ఐరాస నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు వ్యాపార వర్గాలు, పౌర సమాజం, ప్రాంతీయ సంఘాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని తెలిపారు. 2050నాటికి భూమండలాన్ని కర్బనరహితంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం ప్రభుత్వాలు శిలాజ ఇంధనాలపై రాయితీలను తగ్గించాలన్నారు. అలాగే బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాన్ని నిలిపివేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలు కొత్త బొగ్గు ఆధారిత ఉత్పత్తి కేంద్రాలవైపే ఇంకా మొగ్గుచూపుతున్నాయని ఆయన అన్నారు. దీని వల్ల ఆయా దేశాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. 

న్యూజెర్సీకి చెందిన ‘క్లైమేట్‌ సెంట్రల్‌’ అనే సైన్స్‌ ఆర్గనైజేషన్‌ తీర ప్రాంతాలపై పరిశోధనలు చేసి ‘నేచర్‌ కమ్యూనికేషన్స్‌’ పేరుతో ఇటీవల ఓ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ అధ్యయనం ప్రకారం.. సముద్ర మట్టాలు రోజురోజుకీ పెరుగుతుండటంతో 2050 నాటికి 150 మిలియన్ల ప్రజలు నివసిస్తున్న భూమి ‘హై టైడ్‌ లైన్‌’ కిందకు కుంగే ప్రమాదముంది. మన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చాలా భాగం సముద్ర అలల దెబ్బకు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాణిజ్య ప్రాంతాలు విస్తరించడం, భవంతుల నిర్మాణాలే నగరానికి పెను ముప్పు అని అధ్యయనంలో పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.