close

తాజా వార్తలు

ఆటతీరు మార్చుకుంటున్న పంత్‌: యువీ

ముంబయి: యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌కు కుదురుకొనేందుకు తగినంత సమయం ఇవ్వాలని టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. అతడు తన ఆటతీరును మార్చుకుంటున్నాడని వెల్లడించాడు. యువకులకు అండగా నిలిచి వారిని మెరుగైన క్రికెటర్లుగా తీర్చిదిద్దాలని సూచించాడు. సోమవారం సెలక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించాడు. ధోనీ వీడ్కోలు గురించి ప్రశ్నించగా ‘నాకు తెలియదు బాస్‌. సెలక్టర్లను కలిసినప్పుడు ఈ ప్రశ్న వారినే అడగండి. అది వారి నిర్ణయం. నాది కాదు’ అని ఘాటుగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

‘రిషభ్‌ తికమక పడుతున్నాడని అనను. బంతిని బాదాలో, స్ట్రైక్‌ రొటేట్‌ చేయాలో కాస్త అర్థం కావడం లేదు. బంగ్లాతో తొలి మ్యాచ్‌లో బంతికో పరుగు చేశాడు. క్రీజులో అతడు కాస్త సమయం తీసుకోవడం శుభపరిణామం. ఎదుర్కొన్న తొలి బంతినే బాదేయాలన్న తత్వం అతడిది. ఇప్పటి వరకు అతనాడింది కేవలం 8-10 వన్డేలే. అందుకే పంత్‌కు కాస్త సమయం ఇవ్వాలి. ఆటగాళ్లకు అండగా ఉండాలి. ఆర్నెల్లో, ఏడాదో సమయం ఇస్తున్నట్టు చెప్పాలి. ముందు అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. విదేశాల్లో 2 శతకాలు, విండీస్‌పై వరుసగా 2సార్లు 90లు సాధించిన పంత్‌కు టెస్టుల్లో అవకాశం ఎందుకివ్వలేదో అర్థం కాలేదు. అతడి కీపింగ్‌లో కొన్ని లోపాలు నిజమే. అయితే అతడి ఎదుగుదలకు తోడ్పడాలి. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 4, 5 స్థానాల్లో అతడు బాగున్నాడు. కానీ అతడు ఓపెనర్‌ అన్న సంగతి ఎంతమందికి తెలుసు. ఇప్పుడిప్పుడే తన ఆటను మార్చుకుంటున్నాడు. అతడికి సమయం ఇవ్వాలి’ అని యువీ అన్నాడు.

బంగ్లాతో తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన యువ ఓపెనర్‌ శివమ్‌ దూబెను తనతో పోల్చడంపై యువీ స్పందించాడు. ‘ముందు అతడిని కెరీర్‌ ఆరంభించనివ్వండి. కెరీర్‌లో అతడో స్థాయికి చేరుకున్న తర్వాత పోల్చడం మొదలు పెడుదురు. నాతో పోలుస్తారని అనుకోను. అతడో ప్రతిభావంతుడు. సొంతంగా పేరుతెచ్చుకోవాలి. అతడి బ్యాటింగ్‌ శైలిలో కొన్ని మార్పులు అవసరం. వాటిని గుర్తిస్తారో లేదో తెలియదు. బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్ రాఠోడ్‌ ఆ పని చేయాలి. కానీ అతడు టీ20లు ఆడలేదు. దూబె పొరపాట్లను అతడు గుర్తిస్తాడో లేదో చూడాలి. తక్కువ సమయంలోనే ఫలితాలు ఆశించొద్దు’ అని యువీ పేర్కొన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.