close

తాజా వార్తలు

షామీ 5 కెమెరాల ఫోన్‌ విడుదల

ఎంఐ సీసీ9 ప్రో, స్మార్ట్‌ వాచ్‌ల ఆవిష్కరణ

షాంఘై: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షామీ ఎంఐ సీసీ సిరీస్‌లో మరో ఫోన్‌ను విడుదల చేసింది. ఎంఐ సీసీ9 ప్రోగా పిలిచే ఈ ఫోన్‌లో వెనుకవైపు 108 మెగా పిక్సల్‌ సామర్థ్యంతో ఐదు కెమెరాలు కెమెరాలు ఉండడం ప్రత్యేకత. దీనిసాయంతో 4కే రిజల్యూషన్‌తో వీడియోలు తీసుకొనే సౌకర్యం ఉంటుందని సంస్థ వెల్లడించింది. మంగళవారం చైనాలో ఈ ఫోన్‌ను విడుదల చేశారు. 108 ఎంపీ కెమెరాతో రానున్న తొలి ఫోన్‌ ఇదే కావడం విశేషం. అంతేకాక స్క్రీన్‌ విషయంలో బ్లూలైట్‌ను నియంత్రించే సాంకేతికత ఇందులో ఉంది. శాంసంగ్‌ ఎస్‌ 9 మాదిరిగా ఒంపుతో స్క్రీన్‌ అంచులు ఉన్నాయి. ధర సుమారు రూ.35 వేల లోపు ఉండే అవకశముంది.

సీసీ 9 ప్రో మొబైల్‌తోపాటు షామీ సంస్థ రెండు రకాల స్మార్ట్‌ వాచ్‌లను కూడా ఇదే కార్యక్రమంలో విడుదల చేసింది. దీని ధర భారత్‌లో సుమారు రూ.13 వేలు, రూ.20 వేలుగా ఉండే అవకాశముందని ఓ జాతీయ టెక్‌ వార్తా సంస్థ వెల్లడించింది. 

ఎంఐ సీసీ 9 ప్రో ఫీచర్లు
* 6.47 అంగుళాల అమోల్డ్‌ తెర, 2340x1080 పిక్సల్స్‌ స్ర్కీన్‌ రిజల్యూషన్‌.
* 730 జీ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌
* 108+20+12+8+5 మెగా పిక్సల్‌ వెనుక కెమెరాలు, 32 ఎంపీ ముందు కెమెరా
* 6జీబీ, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ, 256 జీబీ ఇంటర్నల్‌ మెమరీ
* 5,260 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.