
తాజా వార్తలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి 2021లో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ తమ పార్టీయే అధికారంలోకి వస్తుందిన ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి తమ పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ.. భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తనను అధికారం నుంచి తప్పించాలనుకునే వారు చేస్తున్న యత్నాలతో ఓటర్లలో వారంటే వ్యతిరేకత ఏర్పడుతుందన్నారు. తృణమూల్‌ను అధికారంలోకి రాకుండా చేయడం భాజపాకు పగటి కలేనని దీదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా 18 స్థానాల్లో విజయం సాధించడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పాలనకు చరమగీతం పాడతామంటూ కమలనాథులు వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె తీవ్రంగా స్పందించారు. భాజపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తన పోరాటం ఆగదని స్పష్టంచేశారు. ‘‘2021లో మా ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందని చెబుతున్నవారే తాము చేసిన దుశ్చర్యల మూలంగా మాట్లాడే అర్హతను సైతం కోల్పోతారు. ఓటర్ల ఆగ్రహానికి గురవుతారు. 2021లోనే మళ్లీ నేనే వస్తా.. ఇదే వేదికపై నుంచి ప్రసంగిస్తా’’ అని మమత అన్నారు. ఓట్లు సంపాదించడమే లక్ష్యంగా సమాజంలో విభజన తీసుకొచ్చే ప్రయత్నం తమ పార్టీ చేయబోదన్నారు. ప్రజల వ్యక్తిగత గోప్యతపై రాజీపడే ప్రసక్తే లేదనీ.. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని మమత స్పష్టంచేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
