
తాజా వార్తలు
మంటల్లో అల్లాడుతున్నా.. కాపాడలేని దైన్యం
తేరుకునేలోపే తీరని నష్టం
ఈనాడు, హైదరాబాద్
అబ్దులాపూర్‌మెట్ తహసీల్దార్ హత్యాకాండ పరిశీలిస్తే.. మరోసారి అగ్నిమాపక నియంత్రణ లోపాలు ఎత్తి చూపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలకు సంబంధించి కనీస జాగ్రత్తలు లేని వైనాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది. తహసీల్దార్ విజయారెడ్డి శరీరంపై దుండగడు పెట్రోల్ పోసి నిప్పు అంటించిన తర్వాత ఆమె బయటకు వచ్చి నేలపై పడిపోయింది. మంటలకు తాళలేక అటు ఇటు దొర్లుతూ హృదయ విదారకరంగా కేకలు పెడుతున్నా.. చాలాసేపటి వరకు మంటలను ఆర్పే ప్రయత్నం జరగలేదు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో తోటి సిబ్బంది సైతం దగ్గరకు వెళ్లలేకపోయారు. చివరికి దుప్పటి లాంటివి తీసుకొచ్చి కప్పినా సరే.. అప్పటికే ఆమె మంటలకు ఆహుతయ్యారు. తహసీల్దార్ కార్యాలయం అంటేనే ఎంతో హడావుడి. నిత్యం వచ్చేపోయే ప్రజల సంఖ్య కూడా ఎక్కువ. ఎన్నో దస్త్రాలు గుట్టగుట్టలుగా పడి ఉంటాయి. అగ్ని ప్రమాదం జరిగితే నష్టం కూడా తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మంటలను అదుపు చేసేందుకు అక్కడ ఎలాంటి జాగ్రత్తలు లేకపోవడం గమనార్హం. అంత పెద్ద ఏర్పాట్లు అవసరం లేకపోయినా.. తక్షణం మంటలను అదుపు చేసేందుకు కార్బన్ డయాక్సైడ్, ఫోం ఇతర వాయువులతో నింపిన సిలిండర్లు గోడలకు ఉండాలి. అవసరమైతే బకెట్లలో ఇసుక నింపి పెట్టుకోవాలి. నీళ్లు అందుబాటులో ఉంచాలి. వెంటనే మంటలను ఆర్పేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అవేవీ లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది సైతం నిస్పహాయంగా ఉండిపోయారు. 101, 108కు ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు. మంటలను ఆర్పే సాధనాలు లాంటివి ఉండి ఉంటే, పరిస్థితి వేరేలా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మంటలను నియంత్రించడానికి కనీస జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
* ప్రభుత్వ కార్యాలయాల్లో నిప్పు అంటుకుంటే వెంటనే అదుపు చేసేందుకు పరికరాలు ఉండాలి. వాటిని వినియోగించడంపై అక్కడి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.
* ఒకవేళ శరీరానికి మంటలు అంటుకుంటే తప్పించుకోవటానికి ముందుగా నేలపై పడుకొని పాకుతూ ముందుకు వెళ్లాలి.
* దుస్తులకు నిప్పంటుకున్నప్పుడు పరిగెత్తడానికి ప్రయత్నించొద్దు. నేల మీద పడుకొని దుప్పటి లేదా రగ్గు శరీరం మొత్తం చుట్టుకొని అటుఇటు దొర్లటం కొంతమేలు చేస్తుంది.
* వంటికి గాయాలైతే వదులుగా ఉండే దుస్తులను ధరించి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి.
* నిప్పు అంటుకొని కాలిపోతున్న వారిపై మందమైన దుప్పటి, గోనె సంచుల లాంటికి కప్పాలి.
* ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్సుల చుట్టూ అగ్నిమాపక యంత్రం తిరిగేందుకు వీలుగా నాలుగు మీటర్ల ఖాళీ స్థలం ఉండాలి
* భవనాల ముందు అద్దాలతో మూసివేయకుండా గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు ఏర్పాటు చేయాలి. వాటి ముందు పెద్ద సైజు హోర్డింగ్‌లు లాంటివి ఏర్పాటు చేయకూడదు
* ప్రతి భవనంలో పది వేల లీటర్ల సామర్థ్యం కల్గిన నీటి ట్యాంకులు లేదా సంపులు ఉండాలి. నీటిని తోడటానికి అనువుగా మోటార్లు అమర్చాలి.
* ఒకే మెట్ల మార్గం కాకుండా అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు వీలుగా మరో మెట్లదారి ఉండాలి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
