close

తాజా వార్తలు

నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను మోసగించిన కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్‌లో అరెస్టయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్‌ కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును యూకే కోర్టు మరోసారి తిరస్కరించింది. 

పీఎన్‌బీ కేసు వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 19న లండన్‌ పోలీసులు నీరవ్‌ మోదీని అరెస్టు చేశారు. ఈ కేసులో నీరవ్‌ బెయిల్‌ దరఖాస్తును యూకే కోర్టు ఇప్పటికే నాలుగు సార్లు తిరస్కరించగా.. ఇటీవల మరోసారి ప్రయత్నించాడు. తాను తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశకు గురవుతున్నానని పేర్కొంటూ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనను గృహనిర్బంధంలో ఉంచాలని అభ్యర్థించాడు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.