
తాజా వార్తలు
ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా నాయకులు
ముంబయి: మహారాష్ట్రలో ప్రస్తుత అసెంబ్లీ ముగింపునకు మరో రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నందున.. ప్రభుత్వ ఏర్పాటుపై ఏక్షణమైనా శుభవార్త వినిపించవచ్చని భాజపా నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మిత్రపక్షాల ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ముంగంటివార్ అన్నారు. బుధవారం శివసేన మంత్రులతో సీఎం నిర్వహించిన సమావేశం రైతుల సమస్యలను ఉద్దేశించిందని పైకి చెప్తున్నా, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిగాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ గురువారం గవర్నర్‌ను కలవనున్నారని భాజపా అధికార ప్రతినిధి అసిఫ్ భామ్లా ప్రకటించారు. దీనిపై స్పందించిన శివసేన నేత సంజయ్ గుప్తా.. ‘‘మా డిమాండ్లు పరిష్కరించనంత కాలం భాజపా ఎన్నిసార్లు వెళ్లి కలిసినా ప్రయోజనం ఉండదు.’’ అని అన్నారు.
రాష్ట్రంలో భాజపా-శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని, తాము ప్రతిపక్ష హోదాలో ఉంటామని బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. 25 ఏళ్లుగా మిత్ర పక్షాలుగా ఉన్న పార్టీలు రాష్ట్రాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
ఎక్కువ మంది చదివినవి (Most Read)
