
తాజా వార్తలు
కోల్కతా: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షలో ప్రాంతీయ భాషలపై కేంద్రం అవలంబిస్తున్న విధానాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తప్పుబట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ 11న రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీలు ఇదే తరహా నిరసనలు చేపట్టాలని ఆమె కోరారు. పరీక్షలో కేవలం గుజరాతీ భాషను మాత్రమే అనుమతించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. బెంగాలీతో పాటు ఇతర ప్రాంతీయ భాషలపై వివక్ష చూపడం తగదన్నారు. దేశంలో విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్నాయని, వాటినీ గౌరవించాలని డిమాండ్ చేశారు. తమ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జేఈఈ మెయిన్స్ పరీక్షలో బెంగాలీని అనుమతించేందుకు గతంలో లేఖ రాస్తే జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ) దాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
