
తాజా వార్తలు
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే
ముంబయి: చారిత్రక అయోధ్య కేసు వివాదంపై ఈ రోజు సుప్రీం తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు ఘనత ఏ ఒక్కరిదో కాదని, ఎవరికి అనుకూలంగా తీర్పొచ్చినా అందరూ సమానంగా స్వీకరించాలన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘రామ మందిర నిర్మాణంపై చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో మేం కోరుతున్నాం. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మరో కొన్ని గంటల్లో ఈ అంశంపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించనుంది. ఒక వేళ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు వచ్చినట్లయితే, అది కేంద్ర ప్రభుత్వం ఘనతగా వారు చెప్పుకోకూడదు. ఎందుకంటే ఇది ఏ ఒక్కరి ఘనత కాదు. ఎంతో మంది భావోద్వేగాలతో కూడుకున్నది’ అని అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలు పూర్తయినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. శివసేన-భాజపా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. నేతల మధ్య మాటలయుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- శరణార్థులకు పౌరసత్వం
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
