
తాజా వార్తలు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చిన ‘సకల జనుల సామూహిక దీక్ష’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. ట్యాంక్‌బండ్‌పైకి వచ్చేందుకు ఉన్న అన్ని మార్గాలను పోలీసులు నియంత్రణలోకి తీసుకున్నారు. నగరంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పలు చోట్ల చెక్‌పోస్టు ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని పలు మార్గాల్లో వాహనాల రాకపోకలపైనా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరికొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను మళ్లించారు.
మరోవైపు చలో ట్యాంక్‌బండ్ దృష్ట్యా ఆర్టీసీ ఐకాస నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గచ్చిబౌలి హెచ్‌సీయూ డిపోకు చెందిన ముగ్గురు, ఫారూఖ్‌నగర్ డిపోకు చెందిన మరో ముగ్గురు కార్మిక నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దీక్ష కార్యక్రమానికి అఖిలపక్ష నేతలు కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. జీడిమెట్లలో సీపీఎం నాయకులను అరెస్టు చేయగా.. అంబర్‌పేట్‌లో మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకొని నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా రామాంతపూర్ మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ, భాజాపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు, గృహనిర్బంధం చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
ఎక్కువ మంది చదివినవి (Most Read)
