
తాజా వార్తలు
ఎన్సీపీ నేత కీలక వ్యాఖ్యలు
ముంబయి: ఏదేమైనా ప్రతిపక్షంలోనే కూర్చుంటామని తెగేసి చెప్పిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ భాజపాను ఆహ్వానించిన నేపథ్యంలో ఎన్సీపీ పార్టీ నేత నవాబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. బల నిరూపణలో శివసేన భాజపాకు అనుకూలంగా ఉండకపోతే ఆ పార్టీకి మద్దతిస్తామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
‘భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. బల నిరూపణ సభలో కచ్చితంగా ఎన్సీపీ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తుంది. అంతే కాకుండా శివసేన కూడా భాజపాకు ఓటేయకపోతే వారితో పొత్తుపై ఆలోచిస్తాం. శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికే గవర్నర్ భాజపాని ఆహ్వానించారు. కానీ మేం మాత్రం ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వం. ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ నవంబరు 12న సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు’ అని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలు గడిచింది. ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకున్న భాజపా-శివసేన మధ్య సీఎం పదవి విషయంలో వివాదం ఏర్పడింది. దీని వల్ల ఇంకా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. 105 స్థానాలు గెలుచుకున్న భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ ఆహ్వానించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
